క్రికెట్ లో ఎన్ని ఘనతలు సాధించినా.. ఐసీసీ ట్రోఫీ లేకపోతే ఆ లోటు అలాగే ఉండిపోతుంది. ఎంతోమంది దిగ్గజాలు ఐసీసీ టైటిల్ లేకుండానే తమ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. సచిన్ లాంటి దిగ్గజాలు సైతం ఐసీసీ ట్రోఫీ కోసం రెండు దశాబ్దాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీకు మాత్రం టైటిల్స్ గెలవడం చాలా ఈజీ. ఆమె టైటిల్స్ చూస్తే ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఆమె సాధించిన టైటిల్స్ ఎవరూ సాధించలేకపోవడం విశేషం.
అంతర్జాతీయ ట్రోఫీలతో పాటుగా పేరున్న టీ20 లీగ్ టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. తాజాగా డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడంతో మరో టైటిల్ ఆమె చెంతకు వచ్చి చేరింది. ఇప్పటివరకు పెర్రీ రెండు వరల్డ్ కప్ లతో ఏకంగా 6 టీ20 ట్రోఫీలు ఉన్నాయి. ఇవి కాక రెండు బిగ్ బాష్ టైటిల్స్ తో పాటు ఒక డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో ఆమె సభ్యురాలు. 16 సీజన్లు ఆడినా కప్ రాని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పెర్రీ అదృష్టం కలిసి వచ్చింది. ఆట, అందం తో పాటు అదృష్టం ఈమెను అంటిపెట్టుకొని ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్న (మార్చి 17) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచింది.
ALSO READ | WPL 2024 Final: మన ప్లేయర్‌కే పర్పుల్ క్యాప్.. ఎవరీ శ్రేయాంక పాటిల్..?
డబ్ల్యూపీఎల్ కు ముందు పెర్రీ మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆమె చెలరేగితేనే జట్టుకు టైటిల్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. అనుకున్నట్లుగానే ఈ ఆసీస్ అల్ రౌండర్ లీగ్ అంతటా అదరగొట్టింది. బ్యాటింగ్ బౌలింగ్ లో చెలరేగి ఆర్సీబీకి ఒంటి చేత్తో విజయాన్ని అందించింది. గెలిస్తే నాకౌట్ వెళ్తుందనుకున్న మ్యాచ్ లో ముంబైపై 6 వికెట్లతో చెలరేగింది. బ్యాటింగ్ లో ఒంటరి పోరాటంతో మెరిసి జట్టుకు ఫైటింగ్ టోటల్ అందించింది. నిన్న జరిగిన కీలకమైన ఫైనల్లో ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తూ 37 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించింది.
Ellyse Perry is a G.O.A.T 🤩🏆#EllysePerry #WPL #RCBUnbox #RCBWomen #WPLFinal #rcbwin #WPL2024 #WPL2024Final #DCvsRCB #RCBvsDC #Cricket #RCBWvsDCW #CricketTwitter pic.twitter.com/nkAcmuKHSx
— cine_sdn (@sdn789_) March 18, 2024