WPL 2024: ఇదేం పిచ్చి రా బాబు.. కోహ్లీని వదిలేసి పెర్రీని పట్టుకున్నారు

WPL 2024: ఇదేం పిచ్చి రా బాబు.. కోహ్లీని వదిలేసి పెర్రీని పట్టుకున్నారు

ఐపీఎల్ లో ఎన్ని టీమ్స్ ఉన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రేజ్ వేరు. మెన్స్ కు మాత్రమే కాదు ఉమెన్స్ లోనూ ఈ జట్టుకు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఆర్సీబీ జట్టుకు ఇంతలా పాపులారిటీ రావడానికి కారణం విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెన్స్ జట్టుకు భారీగా సపోర్ట్ చేస్తారనే సంగతి మనకు తెలిసిందే. కానీ కోహ్లీ పుణ్యమా అంటూ ఉమెన్స్ కు అంతే ఆదరణ లభిస్తుంది. అయితే ఇప్పుడు కోహ్లీని మరిపిస్తూ ఆసీస్ ఉమెన్స్ ఆల్ రౌండర్ ఎలిసా పెర్రీ ఆర్సీబీ జట్టులో సూపర్ స్టార్ గా మారింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్‌‌సీబీ).. తొలిసారి డబ్ల్యూపీఎల్‌‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఎలైస్‌‌ పెర్రీ (50 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 66) మరోసారి చెలరేగడంతో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌‌లో 5 రన్స్‌‌ తేడాతో డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. ఈ మ్యాచ్ కు ముందు అంచనాలు అన్ని పెర్రీ మీదే ఉన్నాయి. ఆమె చెలరేగితేనే జట్టు ఫైనల్ కు వెళ్తుందని ఫ్యాన్స్ భావించారు. అనుకున్నట్లుగానే ఈ ఆసీస్ అల్ రౌండర్ బ్యాటింగ్ లో 66 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవడంతో పాటు, బౌలింగ్ లోనూ కీలకమైన యాస్తికా భాటియా వికెట్ తీసింది.

పెర్రీ ఆల్ రౌండ్ షోతో  ఆర్సీబీ ఫైనల్ కు దూసుకెళ్లడంతో ఇప్పుడు ఆ జట్టు ఫ్యాన్స్ అందరూ పెర్రీ జపాన్ని పాటిస్తున్నారు. ఈ మ్యాచ్ కు ఉన్న ఈ ఆల్ రౌండర్ క్రేజ్ మ్యాచ్ గెలిచినా తర్వాత అమాంతం పెరిపిపోయింది. అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం పెర్రీ, పెర్రీ అంటూ స్లోగన్స్ వినిపించాయి. ఈమె కోసం ఒక స్పెషల్ గా కంపోజ్ చేసిన పెర్రీ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆటతో పాటు అందం కూడా ఉండడంతో ఈ ఆసీస్ స్టార్ ప్లేయర్ క్రేజ్ ప్రస్తుతం ఆకాశాన్ని దాటేసింది. మరి ఇదే ఆటతీరును ఫైనల్లో కొనసాగించి ఆర్సీబీకు టైటిల్ అందిస్తుందో లేదో చూడాలి. 

టాస్‌‌ నెగ్గిన ఆర్‌‌సీబీ తొలుత 20 ఓవర్లలో 135/6 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 130/6 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (33) టాప్‌‌ స్కోరర్‌‌. స్పిన్నర్ శ్రేయాంక (2/16) రెండు వికెట్లతో ఆకట్టుకుంది.