
- బైడెన్ పట్టించుకోలేదని ఆరోపణ
వాషింగ్టన్: ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సేఫ్‌గా భూమికి తిరిగిరావడంపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు స్పేస్ఎక్స్, నాసా టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ మిషన్‌ను బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న ఆస్ట్రోనాట్లను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
‘‘గతంలోనే ఆస్ట్రోనాట్లను భూమి మీదకు తీసుకొచ్చేందుకు మేం ప్రయత్నించాం. ఇందుకోసం అప్పటి ప్రెసిడెంట్ బైడెన్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశాం. కానీ, రాజకీయ కారణాల వల్ల మా ప్రతిపాదనను బైడెన్ తిరస్కరించారు. అప్పుడు బైడెన్ ఓకే చెప్పి ఉంటే.. ఈపాటికి ఎప్పుడో ఆస్ట్రోనాట్లు భూమికి చేరుకునేవాళ్లు’’ అని మస్క్ తెలిపారు.