ఎలన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సంచలనంగా మారుతోంది ఈ మధ్య. అసలు ఈయన డిజిటల్ మార్కెట్ ను ముందుకు తీసుకెళుతున్నాడో.. పడేస్తున్నాడో ఎవ్వడికీ అర్థం కావటం లేదు.. లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయంతో కొన్ని కంపెనీలు మూసేసుకునే పరిస్థితికి వస్తాయనే ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం.. ఎక్స్.. లో 10 లక్షల ఉద్యోగ ప్రకటనలు పోస్ట్ చేసుకోండి.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి అంటూ అనౌన్స్ చేయడమే. వన్ మిలియన్.. అంటే 10 లక్షలు.. దీంతో ఇప్పటికే జాబ్ పోర్టల్స్ లో లీడింగ్ లో ఉన్న లింక్డ్ ఇన్ హైరానా పడుతుంది. 10 లక్షల జాబ్ అనౌన్స్ మెంట్స్ ఎక్స్ వైపు వెళితే..లింక్డ్ ఇన్ పరిస్థితి ఏంటీ అనే కొత్త చర్చ మొదలైంది డిజిటల్ ఇండస్ట్రీలో.
ALSO READ :- కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఏ పథకం ప్రజల కడుపు నింపదు : కే. లక్ష్మణ్
ఎక్స్ ( ట్విట్టర్ ) నుండి వచ్చిన తాజా అనౌన్సమెంట్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఎటువంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్ లేకుండా 10లక్షల ఉద్యోగాలు ప్రకటించుకునే ఆప్షన్ ఇవ్వటం జాబ్ పోర్టల్స్ డివిజన్ లో ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి. ప్రస్తుతం జాబ్ పోర్టల్ ఇండస్ట్రీని ఏలుతున్న లింక్డ్ ఇన్ ఇది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. గూగుల్ కూడా జాబ్ పోర్టల్ ఇండస్ట్రీ మీద కన్నేసిందని వార్తలు ఉన్నప్పటికీ తాజాగా మస్క్ చేసిన ఈ అనౌన్స్మెంట్ వైరల్ అయ్యింది. ఇప్పటికే X Hiring పేరిట వెబ్ వర్షన్, IOS వర్షన్ మీద కసరత్తు జరుపుతున్నారని, త్వరలోనే ఆండ్రాయిడ్ వర్షన్ ని కూడా అందుబాటులోకి తెస్తారని సమాచారం ఉంది. మరి, మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో జాబ్ పోర్టల్స్ లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.