
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అంతరిక్ష ప్రయోగాలకు రారాజు..అమెరికాకు బెస్ట్ సలహాదారు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అనేక కంపెనీలు ఓనర్ అయిన ఎలాన్ మస్క్ బిజీ షెడ్యూల్ లో కూడా బేబీ మేకింగ్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. క్రిప్టో ఇన్ ఫ్ల్యూయెన్సర్, ప్రముఖ యూట్యూబర్ ను తనతో బిడ్డను కనమని అడిగినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే యూట్యూబర్ ‘ఎస్’ చెప్పిందా.. ‘నో చెప్పిందా’..? తర్వాత ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే..
బేబీలతో మస్క్ తన ఫిక్స్ కారణంగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. క్రిప్టో ఇన్ ఫ్ల్యూయెన్సర్, ప్రముఖ యూట్యూబర్ టిఫనీ ఫాంగ్ తనతో బిడ్డను కనమని అడిగాడని తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు మహిళలతో 14 మంది పిల్లలకు తండ్రి అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు రాగా.. తాజాగా మరో మహిళతో తన బేబీ మేకింగ్ కోరికను బయటపెట్టాడు.
క్రిప్టో కమ్యూనిటీలో ప్రసిద్ధ వ్యక్తి టిఫనీ ఫాంగ్.. ఈమెకు Xలో 3లక్షల 35వేలకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. YouTubeలో 48వేల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.FTX ఫౌండర్ సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌తో సహా వివాదాస్పద క్రిప్టో వ్యక్తులతో ఫాంగ్ స్పెషల్ ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియాలో గుర్తింపు పొందింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం..యూట్యూబర్ గా ఫేమ్ అయిన ఫాంగ్ తో Xలో గతేడాదినుంచి ఎలాన్ మస్క్ చాటింగ్ ప్రారంభించాడని ఆమె పోస్టులను తరుచుగా లైక్ చేసేవాడని వాటికి రిప్లై కూడా ఇచ్చేవాడు. ఎలాన్ మస్క్ స్నేహంతో ఫాంగ్ ప్రొఫైల్ వేగం పెరగడమే కాకుండా.. ఆ ప్లాట్ ఫాం కు యాడ్స్ ద్వారా ఆదాయం బాగా పెరిగింది.. కేవలంరెండు వారాల్లో రూ. 18లక్షలు సంపాదించింది.
►ALSO READ | Gemini AI: గూగుల్ జెమినిలో కొత్త ఫీచర్..మీఫొటోలు వెతికేందుకు కష్టపడాల్సిన పనిలేదు
టిఫని ఫాంగ్ ను ఎలాన్ మస్క్ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. ఫాంగ్ ఆదాయం పెరిగిన సంతోషంలో ఉండగా.. గతేడాది నవంబర్ లో ఎలాన్ మస్క్ అడిగిన ఓ కోరిక అంతా తారుమారు చేసింది.‘ తనతో బిడ్డను కనమని టిఫని ఫాంగ్ కు మేసేజ్ చేశాడట. ఫాంగ్ ఒక్కసారిగా షాక్ అయింది. అయితే ఎలాన్ మస్క్ కు నో చెపితే ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా తన ప్రభావం తగ్గిపోతుందని భయపడిందని WSJ తెలిపింది.
అయితే ఫాంగ్ .. ఎలాన్ మస్క్ కు నో చెప్పిందని, చక్కగా పెళ్లి చేసుకొని కుటుంబ జీవితం గడపాలని ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఫాంగ్ నో చెప్పడంతో ఎలాన్ మస్క్ చాటింగ్ మానేశాడు. ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోవడంపై సీరియస్ అయ్యాడట. తర్వాత ఫాంగ్ X ప్లాట్ ఫాంలో ఆదాయం బాగా తగ్గిందట.
కారణాలు ఏమైనప్పటికీ మస్క్ పిల్లలకు తండ్రి కావడం పట్ల కొంత నిమగ్నమై ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం అతనికి నలుగురు వేర్వేరు మహిళలతో 14 మంది పిల్లలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రపంచ జనాభా క్షీణత గురించి అతను తరచుగా తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశాడు. నాగరికత భవిష్యత్తుకు ఎక్కువ మంది పిల్లలను కనడం చాలా ముఖ్యమని బిలియనీర్ బలంగా నమ్ముతున్నాడట. ఈ నమ్మకాన్ని ఎలాన్ మస్క్ మార్స్ గ్రహాన్ని వలసరాజ్యం చేయాలనే తన లక్ష్యంతో అనుసంధానించాడు కూడా.