ఇండియన్స్కి షాకిచ్చిన ఎలాన్ మస్క్: X(ట్విట్టర్) నుంచి 1.9 లక్షల అకౌంట్లు తొలగింపు

ఇండియన్స్కి షాకిచ్చిన ఎలాన్ మస్క్: X(ట్విట్టర్) నుంచి 1.9 లక్షల అకౌంట్లు తొలగింపు

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X(గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ ఇండియన్స్ కి షాకిచ్చారు. ఒక్క నెలలోనే X ఫ్లాట్ ఫాం లో భారతీయులకు చెందిన 1.9 లక్షల అకౌంట్లను రిమూవ్ చేశారు. మే 26 నుంచి జూన్ 25 2024 వరకు  కంపెనీ రూల్స్ పాటించడం లేదని X నుంచి లక్షా 94వేల 053 భారతీయుల అకౌంట్లను తొలగించారు.

అయితే ఇందులో 1,991 ఖాతాలను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే నెపంతో తొలగించడంతో ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫాం చర్చనీయాంశమైంది. కొత్త ఐటీ రూల్స్, వినియోగదారులనుంచి వచ్చిన ఫిర్యాదుల తో ఈ ఖాతాలను తొలగించినట్లు X ప్లాట్ ఫాం తన మంత్లీ రిపోర్టులో తెలిపింది. 

ఐటీ రూల్స్ ఎగవేత కింద 5,289 ఖాతాలు, అడల్ట్ కంటెంట్ కింద 2వేల 768, హేట్ ఫుల్ కండక్ట్ కింద 2వేల 196, వేధింపుల కంటెంట్ కింద 1243 అకౌంట్లను తొలగిం చారు. అయితే ఏప్రిల్ 25 నుంచి మే 25 మధ్య తొలగించిన ఖాతాలకంటే తక్కువే. ఏప్రిల్ 26 , మే 25 మధ్య X 2,29,925 ఖాతాలను నిషేధించింది.