- 20 కోట్ల మంది ఫాలోవర్లుతో రికార్డు
న్యూఢిల్లీ: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ లో రికార్డు సృష్టించారు. ఆ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 20 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. బారాక్ ఒబామా13.19 కోట్ల మంది ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. క్రిస్టియానో రొనాల్డో 11.32 కోట్ల మంది ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలిచారు. జస్టిన్ బీబర్ 11.03 కోట్ల మంది, రిహాన్నా 10.84 కోట్ల మంది ఫాలోవర్లతో వరుసగా నాలుగు, ఐదో స్థానంలో ఉన్నారు. ‘ఎక్స్’ లో భారత ప్రధాని నరేంద్ర మోదీని10 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.