ఎలాన్ మస్క్‌‌‌‌‌‌‌‌ సంపద రూ.38 లక్షల కోట్లు!

ఎలాన్ మస్క్‌‌‌‌‌‌‌‌ సంపద రూ.38 లక్షల కోట్లు!
  • 400 బిలియన్ డాలర్ల  మార్క్‌‌‌‌‌‌‌‌ను దాటి చరిత్ర సృష్టించిన టెస్లా బాస్‌‌‌‌‌‌‌‌
  • రూ.30 లక్షల కోట్ల వాల్యుయేషన్ పలికిన స్పేస్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌
  • రెండింతలు పెరిగిన ఎక్స్‌‌‌‌‌‌‌‌ఏఐ విలువ
  • ట్రంప్‌‌‌‌‌‌‌‌ విజయంతో రికార్డ్ గరిష్టాలకు టెస్లా షేర్లు

న్యూఢిల్లీ: టెస్లా బాస్ ఎలాన్ మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంపద తాజాగా 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ.34 లక్షల కోట్ల) మైలురాయిని దాటింది. ఈ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకున్న  మొదటి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.  మస్క్ సపోర్ట్ చేసిన  డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి  టెస్లా షేర్లు భారీగా ర్యాలీ చేశాయి. దీంతో ఎలాన్ మస్క్ సంపద  గత రెండున్నర నెలల్లోనే 200 బిలియన్ డాలర్లు పెరిగింది. తాజాగా ఆయనకు వాటాలున్న స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ ఒక్కరోజే  62.8 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో మస్క్ మొత్తం సంపద గురువారం నాటికి   447 బిలియన్ డాలర్ల (సుమారు రూ.38 లక్షల కోట్ల) ను టచ్ చేసింది. 

పెరిగిన స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ వాల్యూ..

తాజా బైబ్యాక్ ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్ వాల్యుయేషన్ 350 బిలియన్ డాలర్లు (రూ.30 లక్షల కోట్లు) పలికింది.  ఈ ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కంపెనీ ఉద్యోగులు షేర్లను అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు.  ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ నిలిచింది. ఈ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలో ఎలాన్ మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 42 శాతం వాటా ఉంది. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం,  ఆయన సంపదలో  147 బిలియన్ డాలర్లు ఈ ఒక్క కంపెనీ నుంచే ఉన్నాయి. 

  టెస్లా షేర్లు బుధవారం  424.77 డాలర్ల దగ్గర కొత్త గరిష్టాలను టచ్ చేశాయి.  మస్క్ సంపదలో మెజార్టీ భాగం ఈ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ నుంచే ఉంది. టెస్లాలో మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 20.5 శాతం ఉండగా, దీన్ని 25 శాతానికి పెంచుకోవాలని చూస్తున్నారు. ఈ కంపెనీ షేర్లు 2024 లో  71 శాతం  పెరిగాయి.  డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తీసుకురావడం టెస్లాకు ఈజీ అవుతుందని,  యూఎస్ ప్రభుత్వం  ట్యాక్స్ క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఇస్తుందనే అంచనాలు పెరిగాయి. 

సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఏఐ కంపెనీ..

 మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఏఐ కంపెనీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ  వాల్యుయేషన్ కూడా  రెండింతలు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది.  ట్రంప్ విక్టరీతో మస్క్ కంపెనీలపై  ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరగడమే కారణం. ఈ ఏడాది మేలో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేకరించింది. ఏఐ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విస్తరించేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది.

కలిసొచ్చిన సంవత్సరం..

ఈ ఒక్క ఏడాదిలోనే మస్క్ సంపద రూ.19 లక్షల కోట్లు  పెరిగింది.  కాగా, ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంలో గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫిషియెన్సీ డిపార్ట్‌‌‌‌మెంట్  హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా  మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నియమితులయ్యారు.

సెకెండ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో..249 బిలియన్ డాలర్లు

బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ బిలియనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లో 447 బిలియన్ డాలర్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో మస్క్ కొనసాగుతుండగా, రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో అమెజాన్ బాస్‌‌‌‌‌‌‌‌ జెఫ్‌‌‌‌‌‌‌‌ బెజోస్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. ఆయన సంపద 249 బిలియన్ డాలర్లు (రూ.21 లక్షల కోట్లు) గా రికార్డయ్యింది. బెజోస్ కంటే మస్క్ సంపద ఏకంగా 200 బిలియన్ డాలర్లు (రూ.17 లక్షల కోట్లు) ఎక్కువ. 224 బిలియన్ డాలర్లతో మెటా ఫౌండర్ మార్క్ జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. 

బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిచ్ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో 97 బిలియన్ డాలర్ల (రూ.8.50 లక్షల కోట్ల) తో 17 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ముకేశ్‌‌‌‌‌‌‌‌ అంబానీ, 79 బిలియన్ డాలర్ల (రూ.7 లక్షల కోట్ల) తో 19 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో గౌతమ్ అదానీ ఉన్నారు.