AI ప్రాముఖ్యత రోజురోజుకీ పెరుగుతోంది. చాలా రంగాల్లో హ్యూమన్స్ ని రీప్లేస్ చేసే స్థాయికి చేరింది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. భవిష్యత్తులో AI దేశాన్ని పాలించే స్థాయికి వెళ్లినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఎక్స్ ( ట్విట్టర్ ) అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇటీవల ఓ అంతర్జాతీయ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న మస్క్ మీడియాతో మాట్లాడుతూఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2032 అమెరికా ఎలక్షన్స్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన మస్క్ ఇచ్చిన ఆన్సర్ అందరినీ షాక్ కి గురి చేసింది. 2032లో అమెరికా అధ్యక్ష పగ్గాలు రోబో చేతికి వెళ్తాయని, 2026 సమయానికి మనిషిని శాసించే స్థాయికి AI వెళ్తుందని అన్నారు మస్క్. మొత్తానికి తరచూ సంచలన వ్యాఖ్యలు చేసే మస్క్ తాజాగా AI పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.