ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డ్ఇన్ పై ససిన్హాలన వ్యాఖ్యలు చేశారు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ .లింక్డ్ఇన్ చాలా భయంకరంగా ఉంటుందని, చిరాకు తెప్పిస్తుందని అన్నారు. మస్క్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 200దేశాల్లో 100కోట్లకు పైగా యూజర్స్ ఉన్న జాబ్ పోర్టల్ పై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. మస్క్ లింక్డ్ఇన్ ని టార్గెట్ చేయటం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా లింక్డ్ఇన్ ని టార్గెట్ చేస్తూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు మస్క్.
లింక్డ్ఇన్ మీద డిపెండ్ అవ్వటం మానేసి ఎక్స్ లోనే జాబ్ సర్చ్ చేసుకునేలా ఆప్షన్ తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నామని ఆ మధ్య ట్వీట్ చేశాడు మస్క్. ఇప్పుడు లింక్డ్ ఇన్ మీద ఒక ఎక్స్ యూజర్ చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు మస్క్. మస్క్ ఎక్స్ లో జాబ్ సర్చ్ ఆప్షన్ తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు కాబట్టే తరచూ లింక్డ్ ఇన్ ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో మస్క్ AI సంస్థ ఎక్స్ హైరింగ్ పేరిట జాబ్స్ పోస్ట్ చేస్తోంది.