మస్క్ మాములోడు..కాదు..ముగ్గురు భార్యలు.10 మంది సంతానం

మస్క్ మాములోడు..కాదు..ముగ్గురు భార్యలు.10 మంది సంతానం

ఎలాన్ మస్క్‌‌కు మొత్తం ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురికీ కలిపి తొమ్మిది మంది సంతానం. కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌‌ను 2000 సంవత్సరంలో పెండ్లి చేసుకున్నాడు. 2002లో, విల్సన్ ఒక కొడుక్కి జన్మనిచ్చింది. అతనికి  నెవాడా అలెగ్జాండర్ మస్క్ అని పేరుపెట్టారు. కానీ.. అతను 10 వారాల్లో చనిపోయాడు. తర్వాత ఆ దంపతులు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా పిల్లల్ని కనాలి అనుకున్నారు. అలా జస్టిన్ 2004లో వివియన్, గ్రిఫిన్ అనే కవలలకు జన్మనిచ్చింది. తర్వాత 2006లో ఒకే కాన్పులో కై, సాక్సన్, డామియన్ అనే ముగ్గురికి జన్మనిచ్చింది. కానీ.. వీళ్లు పుట్టిన తర్వాత 2008లో జస్టిన్‌‌ నుండి విడాకులు తీసుకున్నాడు మస్క్‌‌. 

రెండు.. మూడు.. నాలుగు.. 

జస్టిన్‌‌తో విడిపోయిన తర్వాత, అమెరికన్ నటి తాలులా రిలేతో మస్క్ రిలేషన్‌‌లో ఉన్నాడు. 2010లో వీళ్లిద్దరూ పెండ్లి చేసుకున్నారు. కానీ, ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2012లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. వాళ్లిద్దరూ 2013లో మళ్లీ పెండ్లి చేసుకున్నారు. మరో మూడేండ్లు కలిసి ఉన్నారు. కానీ.. ఆ తర్వాత కలిసి జీవించలేకపోయారు. దాంతో  రిలే, మస్క్ 2016లో విడిపోయారు. ఆ తర్వాత కూడా మస్క్ ఒంటరిగా లేడు. 2018లో  సింగర్ గ్రిమ్స్‌‌తో డేటింగ్ మొదలుపెట్టాడు. గ్రిమ్స్ 2020లో ఎలాన్ మస్క్ ఆరవ కొడుక్కి జన్మనిచ్చింది. ఆ తర్వాత మరో కూతురు కూడా పుట్టింది. కానీ.. 2021లో వీళ్లు కూడా విడిపోయారు. కొన్ని నెలల తర్వాత మస్క్ ఆస్ట్రేలియన్ నటి నటాషా బాసెట్‌‌తో ప్రేమలో పడ్డాడు. ఆమె మస్క్ ప్రైవేట్ జెట్ నుండి దిగడం చాలాసార్లు కనిపించింది. ఆ తర్వాత నవంబర్ 2021లో మస్క్ నడుపుతున్న బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్‌‌లో ఎగ్జిక్యూటివ్ అయిన  షివోన్ జిలిస్‌‌తో మస్క్‌‌కి కవలలు పుట్టారనే వార్త చెక్కర్లు కొట్టింది. 

జనాభాను పెంచేందుకే.. 

జనాభా క్షీణతపై ఆందోళన చెందుతున్నట్టు మస్క్ చాలా సార్లు బహిరంగంగానే చెప్పాడు. అందుకే ఆయన తొమ్మిది మంది పిల్లలకు తండ్రి అయ్యానని చెప్తుంటాడు. “-జనాభా పెరగడానికి సాయం చేసేందుకు నా వంతు కృషి చేస్తున్నా” అని ఒకసారి ట్వీట్ కూడా చేశాడు.

మస్క్‌‌ పూర్తి పేరు ఎలోన్ రీవ్ మస్క్. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో 1971లో పుట్టాడు. తండ్రి ఎర్రల్‌‌ దక్షిణాఫ్రికాకు చెందిన ఇంజనీర్‌‌‌‌. తల్లి మాయే కెనడియన్ మోడల్, న్యూట్రిషనిస్ట్‌‌. మస్క్​ తల్లిదండ్రులు1980లో విడాకులు తీసుకున్నారు. అప్పుడు తొమ్మిదేండ్ల మస్క్ తన తమ్ముడు కింబాల్ తండ్రితో ఉండాలని నిర్ణయించుకున్నారు. 

గేమ్‌‌ డిజైన్‌‌

మస్క్‌‌ పన్నెండేండ్ల వయసులోనే ‘బ్లాస్టర్’ అనే వీడియో గేమ్‌‌ తయారుచేశాడు. అంత చిన్న వయసులో కంప్యూటర్‌‌‌‌ గురించి తెలుసుకోవడమే కష్టం. అలాంటిది అంతగా ఇన్ఫర్మేషన్‌‌ అందుబాటులోలేని ఆ టైంలోనే గేమ్ తయారుచేశాడంటే మస్క్‌‌ ఆలోచనలు ఎలా ఉండేవో తెలుసుకోవచ్చు. బ్లాస్టర్‌‌‌‌ని అప్పట్లోనే దాదాపు 500 అమెరికన్ డాలర్లకు అమ్మేశాడు మస్క్‌‌. దాన్ని ఒక కంప్యూటర్ మ్యాగజైన్‌‌ కొనుక్కుంది.

స్పేస్‌‌లో టెస్లా కారు 

ఇది చాలా శక్తివంతమైన రాకెట్. ఫిబ్రవరి 6, 2018న ప్రయోగించారు. ఫాల్కన్ హెవీ విజయవంతంగా ఒక టెస్లా రోడ్‌‌స్టర్ (టెస్లా తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు), స్టార్‌‌మ్యాన్ అనే స్పేస్‌‌ సూట్ వేసుకున్న బొమ్మను స్పేస్‌‌లోకి తీసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీని రెండు రాకెట్‌‌ బూస్టర్లు కెన్నెడీ స్పేస్ సెంటర్ దగ్గర్లో సక్సెస్‌‌ఫుల్‌‌గా ల్యాండ్ అయ్యాయి.