Elon Musk: హ్యాష్ ట్యాగ్(#)లు వేస్ట్.. X నుంచి తీసేస్తానంటున్న ఎలాన్ మస్క్..ఎందుకంటే

Elon Musk: హ్యాష్ ట్యాగ్(#)లు వేస్ట్.. X నుంచి తీసేస్తానంటున్న ఎలాన్ మస్క్..ఎందుకంటే

హ్యాష్ ట్యాగ్(#)ల గురించి సోషల్ మీడియా ఉపయోగించే ప్రతి ఒక్కరికీ తెలుసు. తన పోస్టు ఎక్కువ మందికి రీచ్ కావాలన్నా..  ఎక్కువ పాపులర్ కావాలన్నా.. పోస్టుల్లో హ్యాష్ ట్యాగ్ లను వినియోగిస్తుంటాం..ఇటీవల కాలంలో హ్యష్ ట్యాగ్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతిఒక్కరూ, ప్రతి పోస్టులో హ్యాష్ ట్యాగ్ లు వాడుతున్నారు. అయితే X (గతంలో ట్విట్టర్) బాస్ ఎలాన్ మస్క్ మాత్రం.. హ్యాష్ ట్యాగ్ (#)లు వాడకం దండగ.. హ్యాష్ ట్యాగ్ చాలా అగ్లీగా కనిపిస్తున్నాయి.. హ్యాష్ ట్యాగ్ లను వాడకండి అని సలహా ఇస్తున్నాడు.. ఎందుకు ఎలాన్ మస్క్ అలా అన్నాడో.. హ్యాష్ ట్యాగ్ లేకుంటే కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.. 

ఇటీవల హ్యాష్ ట్యాగ్ (#) లపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. X(గతంలో ట్విట్టర్) లో Grok AI చాట్ బాట్ గురించి కొందరు అడిగినపుడు ఎలాన్ మస్క్ హ్యాష్ ట్యాగ్ గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు. 

హ్యాష్ ట్యాగ్(#) చాలా అగ్లీగా కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ అవసరం లేదు.. నెటిజన్ల హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించడం మానేయండి అని ఎలాన్ మస్క్ చెప్పారు. అంతేకాదు.. హ్యాష్ ట్యాగ్ ల అవసరం ఇకపై ఉండకపోవచ్చు..ఇవి పోస్టుల ప్రాధాన్యతను తగ్గిస్తున్నాయి.. చాలా హ్యాష్ ట్యాగ్ లు వినియోగించడం వాస్తవ కంటెంట్ కు దూరం చేస్తున్నాయని తన అభిప్రాయాన్ని చెప్పారు. ఎక్కువ హ్యాష్ ట్యాగ్ లు ఉపయోగించినప్పుడు సోషల్ మీడియా అల్గారిథమ్స్ పై ప్రభావం చూపుతున్నాయని చెప్పుకొచ్చారు. 

హ్యాష్ ట్యాగ్ లు ఎందుకు వాడకుందంటే.. 

హ్యాష్ ట్యాగ్ లకు ఒకప్పుడు ప్రాధాన్యత ఉండేది.. కానీ ఇప్పుడు కాదు.. సోషల్ మీడియా ప్లాట్ ఫాం అన్నీ చాలా అప్డేట్ అయ్యాయి. యూజర్ల కంటెంట్ ను అర్థం చేసుకోవడం, యూజర్లు ఏదీ ఎక్కువ ఇష్టపడుతున్నారో ఇట్టే గుర్తిస్తున్నాయి. అంటే.. హ్యాష్ ట్యాగ్ లపై ఆధారపడకుండానే యూజర్లకు వారికి కావాల్సిన కంటెంట్ ను అందిస్తున్నాయి. 

బెటర్ అల్గారిథమ్స్: సోషల్ మీడియా ప్లాట్ ఫాంలన్నీ బెటర్ అల్గారిథమ్స్ తో పనిచేస్తున్నాయి. హ్యాష్ ట్యాగ్ వాడకుండానే పోస్ట్ ను అర్థంచేసుకునే సంబంధిత యూజర్లకు అందజేసే కెపాసిటీ కలిగి ఉన్నాయి.

హ్యాష్ ట్యాగ్ లను ఎక్కువగా ఉపయోగిస్తే.. 

సాధారణంగా హ్యాష్ ట్యాగ్ (#) లను వాడితే పోస్టులపై యూజర్లకు ఆసక్తి తగ్గుతుంది.. ఇందుకు ఉదాహరణ.. #లవ్, # ఇస్టాస్టుడ్ వంటివి బాగా పాపులర్ అయ్యాయి.. అయితే వీటిని ప్రస్తుతం యూజర్లు చూడకుండా వదిలేస్తున్నారు. 

హై క్వాలిటీ ఇమేజెస్, ఆసక్తికరమైన క్యాప్షన్లు బాగా ఆకట్టుకుంటాయి. హ్యాష్ ట్యాగ్ వినియోగించకుండానే.. ఆకర్షణీయమైన కంటెంట్ దృష్టిని ఆకర్షిస్తుంది. 
Explore Pages, Trending Sections  వంటి కొత్త కొత్త ఫీచర్లను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అందిస్తున్నాయి.  ఇవి హ్యాష్ ట్యాగ్ లను వాడకుండానే మంచి కంటెంట్ ను ఎలా పొందవచ్చో చెబుతున్నాయి. 

సంబంధం లేని హ్యాష్‌ట్యాగ్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ పోస్ట్‌లు స్పామ్‌గా కనిపించవచ్చు. ఇది ఎక్కువ కాకుండా తక్కువ విజిబిలిటీకి దారి తీస్తుంది.
హ్యాష్‌ట్యాగ్‌లపై ఆధారపడటం కంటే మంచి కంటెంట్‌ని సృష్టించడం, ప్లాట్‌ఫాం కొత్త ఫీచర్లను ఉపయోగించడంపై దృష్టి పెట్టర్ మంచిదని అంటున్నారు ఎలాన్ మస్క్.