- అమెరికాలో ఇవే చివరి ఎన్నికలవుతాయ్
- ఎలాన్ మస్క్సంచలన కామెంట్స్
పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై టెస్లా అధినేత, ‘ఎక్స్’ యజమాని ఎలాన్‌మస్క్ సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలవకపోతే ఇక అంతేనని అన్నారు.
లేదంటే అమెరికాలో ఒకే ఒక్క పార్టీ మిగులుతుందని, ఇక భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని పేర్కొన్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే డొనాల్డ్‌ట్రంప్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
ట్రంప్‌కు మాత్రమే ఓటేయాలని తెలిసినవారికి, తెలియనివారిని ప్రోత్సహించాలని, లేకుంటే వారికి ఇక ఓటు వేసే అవకాశమే ఉండదని చెప్పాలని ప్రజలకు సూచించారు. ఈ ఏడాది జులైలో పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.
తాజాగా, ట్రంప్ అదే ప్రాంతంలో మరో ప్రచార సభ నిర్వహించారు. ఇందులో ట్రంప్‌తో కలిసి మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మస్క్ మాట్లాడారు. అమెరికన్లకు జీవితకాలంలోనే ఇవి ముఖ్యమైన ఎన్నికలు అని చెప్పారు.