
ఎలాన్ మస్క్ ఎన్ని విజయాలు సాధించినా ఆయన్ని రెండు విషయాలు ఎప్పుడూ బాధపెడుతూనే ఉంటాయి. మొదటిది ఆయన మొదటి కూతురు నెవడా మరణం. కాగా.. రెండోది ఆయన మరో కూతురు ‘జెన్నా’తో ఉన్న విభేదాలు.
మస్క్ మాజీ భార్య ‘జస్టిస్ విల్సన్’కు మొదటి కాన్పులో ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లలో ఒకరు జేవియర్ అలెగ్జాండర్ మస్క్. అతను లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారి ‘వివియన్ జెన్నా విల్సన్’గా పేరు మార్చుకున్నాడు.
జెన్నా ఎక్కువగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను నమ్ముతుంది. డబ్బున్నవాళ్లు అందరూ చెడ్డవాళ్లే అంటుంది. చివరికి తండ్రిని కూడా అసహ్యించుకుంటుంది. జెన్నాను కలవడానికి మస్క్ చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ అందుకు జెన్నా ఇష్టపడలేదు. అందుకే ఆమె విషయంలో మస్క్ బాధపడుతుంటాడు.
కరుణాకర్ మానెగాళ్ల