
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ వేగంగా తగ్గుతోంది. పడిపోతున్న అమ్మకాలు, టెస్లా షేర్ల పతనం ఇందుకు కారణాలు. ఆదివారం మస్క్ నికర విలువ 330 బిలియన్ డాలర్లు కాగా, సోమవారం 301 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఒక్క రోజే రూ.2.52 లక్షల కోట్లు (దాదాపు 29 బిలియన్ డాలర్లు) తగ్గింది.
గత డిసెంబర్ నాటికి మస్క్ నెట్వర్త్ 486 బిలియన్ డాలర్లు కాగా, ఈ సంవత్సరంలో ఇప్పటికే 132 బిలియన్ డాలర్లు తగ్గింది. అమెరికా ప్రభుత్వ విభాగం డోజ్ చీఫ్ అయ్యాక జర్మనీలో ఆర్డర్లు 70శాతం తగ్గాయి. చైనాలో షిప్‌మెంట్‌లు 49శాతం పడ్డాయి.