Grok 3 అత్యంత స్మార్టెస్ట్ AI ..రెండు అద్భుతమైన ఫీచర్లు

Grok 3 అత్యంత స్మార్టెస్ట్ AI ..రెండు అద్భుతమైన ఫీచర్లు

ఓపెన్ AI  కాంపిటిటర్..ఎలాన్ మస్క్ AI కంపెనీxAI తన లేటెస్ట్ గ్రోక్ LLM మోడల్ Grok3ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే..గ్రోక్ 3 భూమిపైనే అంత్యంత తెలివై న AI అని ఎలాన్ మస్క్ అభివర్ణించారు.దీనిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా అందరికి ఉచితంగా అందిస్తున్నారు. 

గ్రోక్ 3 ఆవిష్కరించిన కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. గ్రోక్ 3లో ప్రత్యేకత ఏంటంలే డీప్ సెర్చ్, తార్కిక సామర్థ్యం. ఇందులో వాయిస్ మోడ్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం అందుబాటులో లేదు.. మరికొన్ని వారాల్లో ప్రారంభిస్తారు. 

గ్రోక్ 3ని ఓపెన్ AI చాట్ జీపీటీ, గూగుల్ Gemini, DeepSeek R1లకు గట్టి పోటీ ఇవ్వనుంది. గ్రోక్ 3 మూడోతరం LLM..ఇది ఆగస్టు 2024లో వచ్చి గ్రోక్ 2కి కొనసాగింపు. గ్రోక్ 2 కంటే చాలా ఎక్కువ సామర్థ్యం గలది అని xAI తెలిపింది. 

గ్రోక్ 3 యాక్సెస్ ఎలా చేయాలంటే.. 

X యాప్ లోకి వెళ్లి లేదా X వెబ్ సైట్ ద్వారా గ్రోక్ 3 యాక్సెస్ చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్, iOS యాప్ లు, వెబ్ లలో గ్రోక్ 3 ఒక ఆప్షన్ గా ఉంటుంది. దీనిలో రెండు కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఒకటి DeepSearch. ఇది గ్రోక్ వేగవంతమైన ఏజెంట్ సెర్చింగ్ తో వివరణాత్మకమైన, తర్కబద్దమైన ఆన్సర్లు లోతుగా అందిస్తుంది. ఇక రెండోది Think.. ఇది గణితం, సైన్స్, కోడింగ్ లలోని కష్టతరమైన సమస్యలను పరిస్కరించేందుకు సహకరిస్తుంది.