టెక్ బిలయనీర్ ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI ) రంగంలోకి అడుగు పెట్టాడు. ఇటీవల కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI ప్రకటించిన ఎలాన్ మస్క్.. కంపెనీ మొదటి AIమోడల్ ను రేపు (నవంబర్ 05) రిలీజ్ చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ X ద్వారా తెలిపారు.. ఎలాన్ మస్క్ ప్రకటన ఇప్పుడు టెక్ రంగం ఇంటా బయటా సంచలనం సృష్టిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో xAI సామర్థ్యం.. అది కొన్ని ముఖ్యమైన అంశాల్లో బెస్ట్ గా పనిచేస్తుందని ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలాన్ మస్క్ xAI కంపెనీ జూలై 2023లో ప్రారంభించాడు. విశ్వం నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడం xAI కంపెనీ లక్ష్యమని మస్క్ ప్రకటించారు. ఎలాన్ మస్క్ స్వయంగా ఈ కంపెనీకి నేతృత్వం వహిస్తున్నారు.. Opne AI, Google research, Microsoft Research, Google,s DeepMind వంటి ఇతర ప్రధాన AI కంపెనీలకు చెందిన అనుభవం ఉన్న నిపుణల బృందంతో xAI ని స్థాపించాడు ఎలాన్ మస్క్.
Also Read :- హైదరాబాద్ లో గోల్డ్..సిల్వర్ రేట్లు ఇలా..
AI భద్రతా శిఖరాగ్ర సమావేశం అనంతరం బ్రిటన్ ప్రధాని రిషీ సునక్ తో జరిగిన మీటింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భవిష్యత్ గురించి దృష్టి సారించిన ఎలాన్ మస్క్.. xAI ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చరిత్రలో AI అత్యంత విధ్వంసకరం అని .. AI మానవుల మేథస్సును అధిగమిస్తుందని.. దీంతో టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎలాన్ మస్క్ అంచనా వేశారు.
ఏదేమైనా.. ఎలాన్ మస్క్ AI రంగంలోకి అడుగు పెట్టడం.. xAI కంపెనీ తొలి మోడల్ ను విడుదల చేస్తున్నామని లాన్ మస్క్ చేసిన ప్రకటన ఇప్పుడు టెక్ రంగం ఇంటా బయటా సంచలనం సృష్టిస్తోంది.