సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్ (ఇప్పుడు X అని పిలుస్తున్నాం) కొనుగోలుపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొను గోలు చేయడం ఓ పిచ్చితనం అనిపించిందన్నారు.
జీరోగన్ పోడ్ కాస్ట్ లో మాట్లాడిన ఎలాన్ మస్క్..ట్విట్టర్ ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేశాన్నారు. అయితే ట్విట్టర్ తాను కొనుగోలు చేయడం వెనకగా ఓ పెద్ద కారణం ఉందన్నారు. నేను గనక ట్విట్టర్ ను కొనుగోలు చేసి ఉండకపోతే పరిణామాలు అదోలా ఉండేవని అన్నారు.అయితే ట్విట్టర్ తో భవిష్యత్ మంచి రాబడి ఉం టుందని అన్నారు.
2022లో ట్విట్టర్ కొనుగోలుపై తన ఎత్తుగడను వివరించారు ఎలాన్ మస్క్. 44 బిలియన్ల యూఎస్ డాలర్లకు ఈ ప్లాట్ ఫాం ను కొనుగోలు చేయడం వెనక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయకపోతే చిక్కుల్లో పడేవాడిని.. అయితే ట్విట్టర్ లో పెట్టుబడులు రాబోయే రోజుల్లో తనకు విజయాన్ని అందించ గలదని చెప్పారు.