ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్‌వీబీ) (Silicon Valley Bank)ను షట్‌డౌన్ చేస్తున్నట్లు యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) అధికారింగా ప్రకటించింది. అనంతరం ఆ బ్యాంకుకు సంబంధించిన ఆస్తులను సైతం సీజ్ చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. ఇది బ్యాంకింగ్ సెక్టార్లకు పెద్ద షాక్.
ఇదిలా ఉంటే.. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అమెరికా గ్లోబల్ గేమింగ్ హార్డ్‌వేర్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ రేజర్ సీఈవో మిన్ లియాంగ్ టాన్ (Min-Liang Tan) ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ కు ఓ సలహా ఇచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు ఎస్‌వీబీని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చమని చెప్పారు. దీనిపై ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ఎస్‌వీబీని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమేనని అర్ధం వచ్చేలా ‘నేనూ అదే ఆలోచిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఎలాన్ మస్క్(Elon Musk) ట్విట్టర్ ను రూ.4,400 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ బ్యాంకు (Silicon Valley Bank )ను సైతం కొనుగోలు చేయాలా..? వద్దా..? అనే దానిపై ఆలోచిస్తానని చెప్పాడు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంకు కాలిఫోర్నియా, మసాచుసెట్స్ లో 17 బ్రాంచీలతో యూఎస్ లోనే 16వ అతి పెద్ద బ్యాంకుగా ఉంది.
మరోవైపు.. ఎలాన్ మస్క్ రియాక్షన్ పైనా సోషల్ మీడియాలో కామెంట్స్ పేలిపోతున్నాయి. నెటిజన్లు తమకు తోచినట్లు కామెంట్స్ తో కేక పుట్టిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా రియాక్ట్ అవుతూ.. కామెంట్స్ చేస్తున్నారు.