Grok హిందీ యాస వివాదం..ఎలాన్ మస్క్ స్పందన ఎలా ఉందంటే..

Grok హిందీ యాస వివాదం..ఎలాన్ మస్క్ స్పందన ఎలా ఉందంటే..

ఇండియన్ యూజర్ హిందీలో అడిగిన ప్రశ్నలకు గ్రోక్ అవమాన కరంగా మాట్లాడటం పెద్ద దుమారం రేపింది..అంతే కాదు ప్రధాని మోదీపై విమర్శలు, రాహుల్ గాంధీపై భవిష్యత్ నాయకుడంటూ AI చాట్ బాట్ గ్రోక్ సమాధానాలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే గ్రోక్ సమాధానాలపై  సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ఓనర్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు స్పందించారు.

BBC లో వచ్చిన ఆర్టికల్ పై స్పందించిన ఎలాన్ మస్క్..పెద్దగా నవ్వుతూ లాఫింగ్ ఎమోజీని పోస్టు చేశారు. గ్రోక్ భారతదేశంలో తుఫాన్ ఎందుకు సృష్టిస్తోంది అని BBC కథనాన్ని పోస్ట్ చేస్తూ మస్క్ బిగ్గరగా నవ్వుతున్న ఎమోజీతో స్పిందించారు. ఇది కొన్ని గంటల్లోనే మిలియన్లకొద్దీ యూజర్ల దృష్టిని ఆకర్షించింది. 

ALSO READ | Poco F7 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్..ఫీచర్లు లీక్

గతవారం X యూజర్ AI చాట్ బాట్Grok ను ఓ ప్రశ్న అడిగాడు. నాకు తగిన బెస్ట్ మ్యూచువల్స్ లిస్ట్ ఇవ్వాలని హిందీలో అడిగాడు. దీంతో గ్రోక్ చెప్పిన సమాధానం వివాదాస్పదమైంది.యూజర్ను తిట్ల దండకంతో అవమానించింది గ్రోక్. తర్వాత సరదాగా అన్నాను.. అయితే నియంత్రణ కోల్పోయాను అని స్పందించింది. ఇది నెట్టింట బాగా వైరల్ అయింది. 

ఇదిలా ఉంటే దేశంలో రాజకీయాలు, రాజకీయ నేతలగురించి అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానం కూడా చర్చనీయాంశమైంది. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీకంటే నిజాయితీపరుడు అని సమాధానం చెప్పింది. అంతటితో ఆగకుండా నేను ఎవరికీ భయపడను చెప్పడంతో వివాదాస్పదంగా మారింది. 

ఇండియన్ యూజర్లలో గ్రోక్ కు పెరుగుతున్న ప్రజాదరణ క్రమంలో హిందీలో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ గ్రోక్ చెప్పిన సమాధానం చెప్పడంపై కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ దీనిపై వివరణ కోరింది.