అంతా బుల్ షిట్.. ఆమె నాకు స్నేహితురాలు మాత్రమే..

తరచూ వార్తల్లో నిలిచే టెస్లా సీఈవో కమ్ ఛైర్మన్ ఎలోన్ మస్క్.. మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీగా పేరొందిన గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానహాన్ తో ఎలోన్ మస్క్ కు అఫైర్ ఉందంటూ ఇటీవల వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. అదంతా బుల్ షిట్ అని ఆ వార్తలను కొట్టిపారేశారు. సెర్గీ, తాను కేవలం స్నేహితులం మాత్రమేనన్న మస్క్.. గత రాత్రి పార్టీలో కలిసి ఉన్నామని తెలిపారు. స్నేహితులు ఇలా పార్టీల్లో కలవడం సర్వసాధారణమేనని, అంత మాత్రాన సంబంధం ఉందంటే ఎలా అని మస్క్ ప్రశ్నించాడు. గడిచిన మూడేళ్లలో నికోల్ ను కేవలం మూడు సార్లు మాత్రమే కలిశానన్న ఎలోన్ మస్క్... కలిసిన ప్రతీ సారి తమ చుట్టూ చాలా మంది ఉన్నారని, ఎక్కడికీ తాము ఏకాంతంగా వెళ్లలేదని స్పష్టం చేశారు. ఇకపోతే అత్యంత శక్తివంతమైన పిక్ గా అభివర్ణిస్తూ నాసా షేర్ చేసిన ఓ ఫొటోనూ.. మస్క్ కిచెన్ స్లాబ్ తో పోల్చి వైరల్ అయిన విషయం తెలిసిందే.