యూట్యూబ్ గురించి మనందరికి తెలిసింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో ఓ సంచలనం. ఎంటర్ టైన్ మెంట్ తోపాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం ఇది. ఎలాంటి పెట్టుబడి లేకుండా కేవలం టాలెంట్ ను ఉపయోగించి చాలామంది ఈ ఫ్లాట్ ఫాం ద్వారా సంపాదిస్తున్నారు. అయితే ఈ ఫ్లాట్ ఫాంకు పోటీగా X యజమాని అయిన ఎలాన్ మస్క్ XTV యాప్ ను తీసుకొస్తున్నారు.
ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ ఫీచర్లు అందించడం ద్వారా యూజర్ల మనసు దోచుకుంటున్న X ఫ్లాట్ ఫాం.. యూజర్లకు మెరుగైన సేవలందించేందు మరో ముందడుగు వేసింది. త్వరలో గూగుల్ కు చెందిన యూట్యూబ్ కు పోటీగా ఓ కొత్త టీవీ యాప్ ను అందుబాటులో తెస్తోంది.
XTV ఇది యూట్యూబ్ లాగా వినియోగదారులకు మంచి క్వాలిటీ వీడియోలను అందిస్తుందని లిండా చెప్పారు. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు X అనేక మార్పులు చేస్తుందన్నారు. XTV యాప్ ద్వారా మీ స్మార్ట్ టీవీల్లో రియల్ టైం, ఆకర్షణీయమైన వీడియోలను అందిందబోతోంది.