న్యూఢిల్లీ: ఇప్పుడు తాను ట్విట్టర్ సీఈఓ కాదని, తన డాగ్ ఫ్లోకి టేకోవర్ చేసిందని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ పేర్కొన్నారు. తన డాగ్‌కు మెడ దగ్గర నల్లగా ఉంటుందని, వాయిస్ గంభీరంగా ఉంటుందని, ఇంతకు మించి ఇంకేం కావాలని ట్వీట్ చేశారు. అడ్వర్టయిజర్లు తిరిగి రావడంతో చచ్చి చెడి ట్విట్టర్ బ్రేకీవెన్‌లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మస్క్ టేకోవర్ చేసిన తర్వాత కంపెనీ అడ్వర్టయిజర్లు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. మరోవైపు ట్విట్టర్‌ను ఎక్స్ కార్ప్‌లో మస్క్ విలీనం చేశారు. దీంతో ఈ సోషల్ మీడియా కంపెనీ ఇక నుంచి ఇండిపెండెంట్ కంపెనీగా కొనసాగదు. ఎక్స్‌గా పిలిచే ‘ఎవ్రిథింగ్ యాప్’ ను క్రియేట్ చేయాలని చూస్తున్న ఎలన్ మస్క్, ట్విట్టర్ ఈ ప్లాన్‌లో ఒక భాగమని గతంలోనే ప్రకటించారు. చైనాలోని వీ చాట్ మాదిరి ఓ సూపర్ యాప్ తేవాలనుకుంటున్నారు.