ఎలాన్ మస్క్ ఎక్స్‌‌ సెంటిమెంట్‌ కథ

 ఎలాన్ మస్క్  ఎక్స్‌‌  సెంటిమెంట్‌ కథ

మస్క్‌‌కి ‘ఎక్స్‌‌’ అక్షరం బాగా కలిసొస్తుంది అంటుంటారు. అందుకే ఆయన ఏ కంపెనీ పెట్టినా అందులో ఎక్స్‌‌ ఉండేలా చూసుకుంటాడు. మొట్టమొదట మస్క్‌‌ పెట్టిన కంపెనీకి ‘ఎక్స్‌‌.కామ్‌‌’ అని పేరు పెట్టాడు. ఆ తర్వా ‘స్పేస్‌‌ ఎక్స్‌‌’ పెట్టాడు. అంతెందుకు టెస్లా నుంచి ‘మోడల్ ఎక్స్‌‌’ పేరుతో ఓ కారుని తీసుకొచ్చాడు. చివరికి ఈ మధ్య కొన్న ట్విట్టర్‌‌‌‌ పేరుని కూడా ‘ఎక్స్‌‌’గా మార్చేశాడు. అంతేకాదు.. 1999లో  పెట్టి, అమ్మేసిన ‘x.com’ను 2017లో తిరిగి కొన్నాడు. దానికి కారణం.. కూడా ‘ఎక్స్’ సెంటిమెంటే. 

న్యూరాలింక్ 

మస్క్‌‌ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తు మీదే  ఉంటాయి. అందుకే ఆయన కంపెనీలను కూడా భవిష్యత్తు గురించి ఆలోచించే పెడతాడు. అందరూ డీజిల్‌‌, పెట్రోల్‌‌ కార్లు వాడుతున్న టైంలో ఎలక్ట్రిక్‌‌ కార్లు తీసుకురావాలి అనుకున్నాడు. చంద్రుడి మీదే పట్టు సాధించలేని టైంలో ‘మిషన్‌‌ మార్స్’ మొదలుపెట్టాడు. అలాంటి భవిష్యత్తు ఆలోచనల నుంచి పుట్టిందే ‘న్యూరాలింక్‌‌’ కూడా. ఈ కంపెనీని 2016లో శాన్ ఫ్రాన్సిస్కోలో మస్క్, మాక్స్ హోడాక్, పాల్ మెరోల్లా కలసి -స్థాపించారు. ఈ కంపెనీలో మనిషి మెదడును కంప్యూటర్లకు కనెక్ట్ చేయడానికి అల్ట్రా-హై బ్యాండ్‌‌విడ్త్ బ్రెయిన్–మెషిన్ ఇంటర్‌‌ఫేస్‌‌లను డెవలప్‌‌ చేస్తున్నారు. దీని ద్వారా పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ల మెదడులో ఒక చిప్‌‌ని పెడతారు. దాని ద్వారా మెదడుని కంట్రోల్‌‌ చేస్తారు. 

ఏఐలోనూ మస్క్ మార్క్‌‌

ఇప్పుడంతా ఏఐ గురించే మాట్లాడుతున్నారు. కానీ.. మస్క్ 2015లోనే ఏఐ టెక్నాలజీ ఇంపార్టెన్స్‌‌ తెలుసుకున్నాడు. అందుకే ఏఐ రీసెర్చ్ సంస్థ ఓపెన్‌‌ ఏఐ ప్రారంభ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌‌లో చేరారు. కానీ... ఏఐ సేఫ్టీపై భిన్నాభిప్రాయాలు రావడంతో 2018లో ఆ కంపెనీ నుంచి బయటికి వచ్చేశాడు. ఇప్పుడు ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు. అయితే.. ఏప్రిల్ 2023లో మస్క్ ఏఐ స్టార్టప్‌‌ను మొదలుపెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అందరూ అనుకున్నట్టుగానే జులై 12 ‘ఎక్స్ ఏఐ’ అనే స్టార్టప్ కంపెనీని  మస్క్ అధికారికంగా ప్రకటించాడు.