Tesla CEO: టెస్లా కొత్త సీఈవోగా టామ్ జు!.. ఎలాన్ మస్క్ తప్పుకోనున్నారా?

Tesla CEO: టెస్లా కొత్త సీఈవోగా టామ్ జు!.. ఎలాన్ మస్క్ తప్పుకోనున్నారా?

Tesla సీఈవోగా ఎలాన్ మస్క్ తప్పుకోనున్నారా? ఆయన స్థానంలో టెస్లా చైనా ప్రెసిడెంట్ టామ్ జుని నియమించనున్నారా.. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత మూడు నెలలుగా టెస్లా కంపెనీలషేర్లు, ఉత్పత్తుల అమ్మకాలు పడిపోవడం, టెస్లాకు వ్యతిరేకంగాఅమెరికాలో పెరుతుతున్న నిరసనలు  ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

టెస్లా సీఈఓ పదవి నుంచి ఎలాన్ మస్క్ తప్పుకోవాలి లేదా తన ఇతర బాధ్యతలను వదులుకోవాలి అని టెస్లా ఇన్వెస్టర్ రాస్ గెర్బర్ చెప్పడం ఇందుకు సంకేతంగా భావిస్తున్నారు. 2025 మొదటి మూడు నెలల్లో టెస్లా స్టాక్స్ 36శాతం క్షీణించడం ఇది 2022 తర్వాత అత్యంత తీవ్రమైన తగ్గుదలగా నమోదు కావడం టెస్లా పార్టినర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

వెల్త్ మేనేజ్‌మెంట్ CEO గెర్బర్.. మస్క్ ప్రభుత్వంలో తన DOGE పాత్రకు స్పష్టంగా కట్టుబడి ఉన్నాడని అన్నారు. టెస్లాను నడపడం కంటే ట్రంప్ పరిపాలనతోనే తాను ఎక్కువ సమయం గడుపుతున్నానని  చెప్పారు. బిజినెస్ పై ఎలాన్ మస్క్ దృష్టి పెట్టలేక పోతున్నారు..టెస్లాకు కొత్త CEO అవసరం అని గెర్బర్ అన్నారు. ఎప్పటినుంచో కంపెనీ బోర్డులో మార్పును కోరుకుంటున్నారు రాస్ గెర్బర్. మస్క్ DOGE బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ విషయాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు. 

గత కొంతకాలంగా గతంలో తన సంస్థ కోసం టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించిన ఫ్రెంచ్ వ్యాపారవేత్త రోమైన్ రాయ్, మస్క్ మరియు అమెరికా విధానాలకు నిరసనగా ఇటీవల ఒక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. రాయ్ పదిహేను టెస్లా కార్ల ఆర్డర్‌ను రద్దు చేసుకుని యూరోపియన్ బ్రాండ్‌లను ఎంచుకున్నాడు.