Space X, స్టార్ లింక్ నెటవర్క్ అధినేత ఎలాన్ మస్క్ ఆందోళనతో శనివారం(మే 11) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.ఆందోళనకు కారణం..అంతరిక్షంలో అతని కంపెనీకి చెందిన ఉపగ్రహాలు ప్రమాదంలో ఉన్నాయట. శక్తివంతమైన జియోమాగ్నటిక్ సోలార్ స్ట్రామ్ కారణంగా తన కంపెనీకి చెందిన ఉపగ్రహాలు ప్రమాదంలో ఉన్నట్లు Xలో పోస్ట్ చేశాడు. అసలు జియోమాగ్న టిక్ సోలార్ స్ట్రామ్ అంటే ఏమిటి..? భూ కక్ష్యలోఉన్న శాటిలైట్స్ పై ఇది ఏ విధంగా ప్రభావం చూపుతుంది..? ఎలాన్ మస్క్ ఎందుకు భయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
అసలేం జరిగిందంటే..
ఎలోన్ మస్క్స్పే SpaceX శాటిలైట్ యూనిట్ స్టార్ లింక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. జియోమాగ్నెటిక్ సోలార్ తుఫాను కారణంగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు చాలా ఒత్తిడికి గురవుతున్నాయని ఎలాన్ మస్క్ ఆందోళనతో ఓ పోస్ట్ ను X లో షేర్ చేశాడు.
అంతరిక్షంలో ఎన్నడూ లేనంతగా మాగ్నెటిక్ సోలార్ స్ట్రామ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇది 2003 తర్వాత సంభవించిన అతిపెద్ద సౌర తుఫాన్.శక్తివంతమైన జియో మాగ్నెటిక్ సోలార్ తుఫాన్ కారణంగా భూ కక్ష్యలో ఉన్న దాదాపు 7500 ఉపగ్రహాలను ప్రభావితం చేస్తోంది. అంతరిక్ష వాతావరణ అంచనా కేంద్రం (SWPC) శుక్రవారం (మే 10) సాయంత్రం భూఅయస్కాంత కార్య కలాపాల పాయింట్ స్కేల్ పై 5 తీవ్రతను హైలైట్ చేసింది. ఇది భూకక్ష్యలో ఉన్న ఉపగ్రహాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.
ఎలాన్ మస్క్ ఎందుకు భయపడుతున్నారు?
Space X, Starlink శాటిలైట్ కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ ఇప్పుడు ఆందోళన ఉన్నారు. ఎందుకంటే.. శక్తివంతమైన జియోమాగ్నెటిక్ సోలార్ స్ట్రామ్ కారణంగా తన స్టార్ లింక్ ఉపగ్రహాలు ప్రమాదంలో పడ్డాయి. భూకక్షలో ఉన్న 7500 ఉపగ్రహాల్లో దాదాపు 6000 ఉపగ్రహాలు ఎలాన్ మస్క్ కంపెనీ ఉపగ్రహాలే. ఇవి గనక సౌర తుఫాను ప్రభావానికి గురైతే.. ప్రపంచ వ్యాప్తంగా సగానికి సగం దేశాల్లో ఇంటర్నెట్ నిలిచిపోతుంది.
అంతరిక్షంలో ఏం జరుగుతోంది ?
ప్రస్తుతం అంతరిక్షంలో భారీ జియో మాగ్నటిక్ సోలార్ స్ట్రామ్ అల్లకల్లోం సృష్టిస్తోంది. చాలా కాలంగా తర్వాత సంభవించిన అతిపెద్ద విపత్తు. ఈ సౌర తుఫాను కారణంగా స్టార్టింగ్ ఉగగ్రహాలు చాలా ఒత్తిడికి గురవుతున్నాయి. అయితే ఇప్పటివరకు అయితే తట్టుకొని నిలబడ్డాయి. కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఎలాన్ మస్క్ ఆందోళన చెందుతున్నారు.
జియో మాగ్నెటిక్ సోలార్ స్ట్రామ్ ప్రభావం..
అంతరిక్షంలోని భూ కక్ష్యలో దాదాపు 7500 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఇవి గ్రౌండ్ ట్రాన్స్ సీవర్లతో కమ్యూనికేట్ చేస్తాయి. కస్టమర్లకు హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందజేస్తాయి.అంతర్ ఉపగ్రహ లేజర్ లింకులు కాంతి వేగంతో అంతరిక్షంలో ఒకదానికొకటి డేటాను పాస్ చేస్తాయి. ఈ నెట్ వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కవరేజ్ ని అనుమతిస్తుంది. జియో మాగ్నెటిక్ సోలార్ స్ట్రామ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 దేశాల్లో ఇంటర్నెట్ సేవలపై ప్రభావం పడనుంది. స్టార్ లింక్ కంపెనీ భూమి చుట్టుూ తిరుగుతున్న 7500 ఉపగ్రహాల్లో శాతం ఉపగ్రహాలను కలిగి ఉంది. ఇది ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న అతిపెద్ద సంస్థ.
ఉపగ్రహాలు ప్రభావితమైతే అవి భూమిపై నావిగేషన్, కమ్యూ నికేషన్ సేవలకు అంతరాయం కలిగించొచ్చు.US నేషనల్ ఓషియానిక్ అం డ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేస్ట్రేషన్ (NOAA) జియోమాగ్నె టిక్ తుఫాను పెద్దఎత్తున వోల్టేజ్ల నియంత్రణ సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తోంది. కొన్ని గ్రి డ్ వ్యవస్థలు పూర్తిగా పతనం లేదా బ్లాక్ అవుట్లను ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెపుతోంది. అంతేకాకుండా నివాసాల్లో విద్యుత్ పై కూడా ప్రభావం చూపొచ్చని హెచ్చరిస్తోంది.
భూఅయస్కాంత తుఫాన్ ఎలా వస్తుంది?
భూఅయాస్కంత సోలార్ తుపాన్ అనేది భూమి మాగ్నటోస్పియర్ లో కలిగి మార్పు. సౌర గాలినుంచి భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణంలోకి శక్తి మార్పిడి జరిగినప్పుడు ఇది సంభవిస్తుంది. సూర్యుని నుంచి విడుదలయ్యే కరెోనల్ మాస్ ఎజెక్షన్స్ (CME) అని పిలువబడే శక్తివంతమైన సౌర మంటలను కలిగి ఉంటుంది. భూమి మాగ్నటోస్పియర్ లోని ప్రవాహం, ప్లాస్మా , సౌరగాలిలో మార్పు కారణంగా ఈ సౌర తుఫానులు ఏర్పడతాయి. బుధవారం (మే 8) మొత్తం ఏడు సార్లు ఈ సౌర తుఫాను సంభవించిందని NOAAవెల్లడించింది. ఈ సౌర తుఫాను ఈవారం మొత్తం కొనసాగవచ్చని తెలిపింది. చివరి సారి ఈ సౌర తుఫాన్ ఏర్పడినపుడు స్వీడన్ లో విద్యుత్తు అంతరాయం, దక్షిణాఫ్రికాలో ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.