Elon Musk: మళ్లీ తండ్రయిన ఎలాన్ మస్క్.. 14వ సంతానంపై మస్క్ ఎమన్నాడంటే..

Elon Musk: మళ్లీ తండ్రయిన ఎలాన్ మస్క్.. 14వ సంతానంపై మస్క్ ఎమన్నాడంటే..

అమెరికా బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ తండ్రయ్యాడు. ఇప్పటి వరకు 13 మంది సంతానంతో పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్న మస్క్.. తన కుటుంబంలోకి మరో వారసుడు వచ్చాడని ప్రకటించాడు.  తన న్యూరాలింక్ కంపెనీ ఎక్జిక్యూటివ్, సహజీవనం చేస్తున్న భాగస్వామి అయిన శివోన్ జిలిస్ ద్వారా 14 సంతానం పొందినట్లు కన్ఫామ్ చేశాడు. వీళ్లిద్దరికీ ఇప్పటికే మూడేళ్ల కవలలు స్ట్రైడర్, అజూర్ తో పాటు, ఒక ఏడాది పాప ఆర్కేడియా ఉన్నారు. ఇప్పుడు పుట్టిన బాబుతో వీరికిది నాల్గవ సంతానం.

తమకు మరో బాబు పుట్టాడని జిలిస్ ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది. ‘‘ఆర్కేడియా బర్త్ డే రోజు ఎలాన్ మస్క్, నేను చర్చించాం.  మరో బాబు మా మధ్యలోకి రావడం చాలా అద్భుతమైన విషయంగా భావిస్తున్నాం. ఈ విషయాన్ని మస్క్ తో చర్చించాను..’’ అని రెడ్ హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేసింది. దీనికి మస్క్ కూడా రెడ్ హార్ట్ సింబల్ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. 

Also Read :- ఉక్రెయిన్ పై మరోసారి దండయాత్ర

ఎలాన్ మస్క్ తో అతని 13వ సంతానంగా బిడ్డను కన్నానని ఇటీవలే.. రైటర్, మాగా ఇన్ ఫ్లూయెన్సర్ యాష్లీ క్లైర్ (26)  ప్రకటించడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. చిన్నారిని పెంచడంలో మస్క్ ఎలాంటి సహాయం చేయటంలేదని, పట్టించుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎలాన్ మస్క్ తండ్రే అని కావాలంటే పేరెంట్ టెస్ట్ చేయొచ్చునని ఆమె కోర్టుకెక్కింది. దీంతో మే 29, 2025 వరకు ఈ విషయంపై స్పందించాలని న్యూయార్క్ జడ్జ్ మస్క్ ను ఆదేశించారు. ఈ వివాదం జరిగిన కొన్నాళ్లకే మస్క్ కు 14వ సంతానం కలగడం గమనార్హం. 

 చిత్రమైన పేర్లు .. మస్క్ 14 మంది సంతానం గురించి:

శివోన్ జిలిస్ కు కలిగిన 4 గురు సంతానం కాకుండా.. మస్క్ కు మొదటి భార్య జస్టిన్ విల్సన్ తో 5 మంది పిల్లలను కన్నాడు. అందులో వివియన్, గ్రిఫిన్ అనే కవలలు, ఒకే సారి కలిగిన ముగ్గురు సంతానం (ట్రిప్లెట్) కాయి, సాక్సన్, డమైన్ ఉన్నారు. వీళ్లకు కలిగిన మొదటి సంతానం నెవెడా అలెక్జాండర్ మస్క్ 10 వారాలకే చనిపోయాడు. 

అదేవిధంగా మ్యుజీషియన్ గ్రిమ్స్ తో మస్క్ కు ముగ్గురు పిల్లలున్నారు. కుమారులు ఎక్స్, టెక్నో మెకానికస్, కూతురు ఎక్సా డార్క్ సిడారల్ వీరికి పుట్టిన సంతానం. 

ప్రపంచ వ్యాప్తంగా సంతానం తగ్గిపోతున్నందున ఎక్కువ మందిని కనాలనేది తన ఉద్దేశం అని, భవిష్యత్తుకు పెద్ద కుటుంబాలు ఉండటం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అందులో భాగంగా తాజాగా 14వ సంతానాన్ని పొందాడు. అయితే మస్క్ ఎక్కువ మందిని కనటం తో పాటు తన ఫ్రెండ్స్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కు సంతానం కలిగేందుకు అవసరమైన వారికి స్పెర్మ్ దానం కూడా చేయటం విశేషం.