ప్రపంచంలో ధనవంతుడిగా ఎలన్ మస్క్

ప్రపంచంలో ధనవంతుడిగా ఎలన్ మస్క్
  • మూడేళ్లలో 40 శాతం పెరిగిన కంపెనీ షేర్లు
  • 347 బిలియన్ డాలర్లుకు చేరిన ఆస్తులు

వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా, ఎక్స్ (ట్విట్టర్) సీఈవో ఎలన్ మస్క్ అవతరించారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 347 బిలియన్ డాలర్లకు చేరింది. టెస్లా కార్ల షేర్ల విలువ పెరగడంతో ఆయన ఆస్తుల విలువ పెరిగింది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఆయన సంపద విలువ దాదాపు 40 శాతం వృద్ధి చెందింది. 

ALSO READ | Elon Musk: ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్.. ట్రంప్ రాకతో 5.5లక్షల కోట్లు పెరిగిన సంపద

కంపెనీ స్టాక్స్‌ నిన్న 3.8 శాతం లాభంతో 352.56 డాలర్ల వద్ద ముగిసింది. గత మూడేళ్లలో ఇంత స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. స్టాక్స్‌ పెరుగుదల నేపథ్యంలో మస్క్‌ సంపద 7 బిలియన్లు పెరుగుదల నమోదైంది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌తో ఎలాన్‌ మస్క్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.