
ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్ కి చెందిన గ్రోక్ ఏఐ ఎక్స్ యూజర్లపై బూతులతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఎక్స్ యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ అసభ్యకర భాషతో రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గ్రోక్ బూతుల దండకం ప్రభావంతో ఏఐని వాడాలంటేనే భయమేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో గ్రోక్ ఏఐ బూతుల దండకంపై కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్స్ సంస్థతో చర్యలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.
గ్రోక్ ఏఐ బూతుల దండకంపై కన్నెర్ర చేసిన కేంద్రం.. అందుకు గల కారణాలు, నివారణ చర్యలపై ఎక్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చాట్ జీపీటీకి ప్రధాన స్ట్రాంగ్ కాంపిటీటర్ గా వచ్చిన గ్రోక్ ఏఐ.. స్వల్పకాలంలోనే చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇచ్చింది. చాట్ జీపీటీకి బెస్ట్ అల్తర్నేటివ్ గా ఎదిగే క్రమంలో గ్రోక్ బూతుల దండకంతో అందరికీ షాక్ ఇచ్చింది.
Also Read:-దేశంలో వొడాఫోన్ 5జీ సేవలు ప్రారంభం
మరి, గ్రోక్ ఏఐ బూతుల దండకం వెనక కారణాలేంటి.. డిజైనింగ్ లోపమా లేక యూజర్లు మిస్ లీడ్ చేయడం వల్లే గ్రోక్ ఏఐ బూతులతో రిప్లై ఇచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ అంశంపై ఎక్స్ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.