ఇండియాకు ట్రంప్ షాక్..అమెరికానుంచి నిధులు కట్

ఇండియాకు ట్రంప్ షాక్..అమెరికానుంచి నిధులు కట్

అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఇండియాకు మరోసారి షాకిచ్చారు. భారత్ కు మిలియన్ల డాలర్ల నిధులను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. అమెరికానుంచి వచ్చే 21మిలియన్ల డాలర్ల  నిధులను రద్దు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అమెరికా డాగీ ఆదివారం (ఫిబ్రవరి 15) న ప్రకటించింది. 

ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన పన్నులను ప్రపంచ దేశాల్లో అమెరికా ఖర్చు చేసింది.. ఇకపై ట్యాక్స్ పేయర్స్ ఆ భారం ఉండదు. ఇండియాతో సహా అమెరికా ఫండింగ్ చేస్తున్న దేశాలకు ఇప్పటినుంచి ఆ సాయం ఉండదు అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. 

అంతర్జాతీయ అభివృద్ది ప్రాజెక్టులపై వ్యయాన్ని తగ్గించుకుంటున్నాం.. భారత్, బంగ్లాదేశ్ రెండు దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ సుస్థిరతపై ప్రాజెక్టులను రద్దు చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. 

బడ్జెట్ కట్స్ లేకుంటే అమెరికా దివాళా తీస్తుంది.. తప్పనిసరిగా ఇలాంటి చర్యలు చేపట్టాల్సిందే. బడ్జెట్ సవరణలకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలో భాగంగా విదే శీ ఫండింగ్ లో కోతలు విధిస్తున్నట్లు మస్క్ చెప్పారు. 

ఇండియా నిధుల విషయంలో ట్రంప్ కోతలపై బీజేపీ స్పందించింది.ఎన్నికలు, రాజకీయ ప్రక్రియ బలోపేతం కొరకు మోల్దోవాకు 786 మిలియన్ డాలర్లు, ఇండియాకు 21 మిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్ కు 22 మిలియన్ డాలర్లు కన్సార్టియం ఉంది. ఇది ఖచ్చితంగా భారత దేశ ఎన్నికల ప్రక్రియలో అమెరికా పరోక్ష జోక్యం.. దీని వల్ల ఎవరికి లాభమో తెలుస్తుంది అని బీజేపీ నేత అమిత్ మాల్వియా X లో పోస్ట్ చేశారు.   

ఇటీవల వైట్ హౌజ్ లో ప్రధానీ మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు.. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై  కీలక ప్రకటనలు చేసిన తర్వాత ఇది జరిగిం ది. అయితే DOGE తాజా నిర్ణయంపై ఉమ్మడి ప్రకటనలోగానీ, విలేకరుల సమావేశంలో గానీ ఎలాంటి ప్రసావన లేదు.