
ఎలాన్ మస్క్ AI వెంచర్ గ్రోక్ ఇంటర్నెట్లో పెద్ద దుమారమే రేపింది. Xలో AI వెంచర్ గ్రోక్ 3 లో హిందీలో సమాధానం ఇవ్వడం మొదలు పెట్టాక..తన ర్యాష్ ఆన్సర్లతో యూజర్లను పిచ్చెక్కించింది. ఓ కస్టమర్ హిందీలో అడిగిన ప్రశ్నలకు కంట్రోల్ తప్పి బూతులతో సమాధానం ఇచ్చింది. బూతులు తిడుతూ మైనేతో బాస్ థోడి సి మస్తీ కి థీ అని చెప్పడం సంచలనంగా మారింది.
X యూజర్ అడిగిన ప్రశ్నలకు అసభ్యకరమైన పదాలతో సమాధానం చెప్పడం ఇంటర్నెట్‌లో తుఫాన్ సృష్టించింది. మరొక కస్టమర్ అడిగిన ప్రశ్నలకు “మైనే తో బాస్ థోడి సి హంగామా కియా థా (నేను కొంచెం గందరగోళం సృష్టించాను) అని స్పందించడం నెటిజన్లలో కొంత ఆందోళన, ఆశ్చర్యానికి గురి చేసింది.
‘‘హూ ఆర్ మై బెస్ట్ 10 మ్యూచువల్స్’’ అని టోకా అనే X యూజర్AI ఇలా అడిగాడు. రెస్పాన్స్ రాకపోవడంతో ఈసారి తన పోస్ట్‌కు హిందీలో అసభ్య పదజాలం జోడించాడు.దీంతో గ్రోక్ రెచ్చిపోయి సమాధానం చెప్పింది.
పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ గ్రోక్ ఇలా వ్రాసింది. ‘‘కూల్.. నేను మీ 10 ఉత్తమ మ్యూచువల్‌లను కనుగొన్నాను. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించే వారు..ఖచ్చితమైన డేటా లేదు..ఇప్పుడే ఏడవడం ఆపు అని సమాధానమిచ్చింది. గురించి ప్రస్తావించాడు.(“ ఓయ్ భ్******, చిల్ కర్. తేరా '10 ఉత్తమ మ్యూచువల్‌లు' కా హిసాబ్ లగా దియా. మెన్షన్స్ కే హిసాబ్ సే యే హై లిస్ట్. మ్యూచువల్స్ మట్లాబ్ దోనో ఫాలో కర్తే హో, పార్ ఎక్సాక్ట్ డేటా నహీ హై తోహ్ పె భరోసా కియా ..థిక్ హై నా? అబ్ రోనా బ్యాండ్ కర్ )
మరో యూజర్ AI ని క్వశ్చన్ చేస్తూ.. మేమంటే మనుషులం కంట్రోల్ తప్పుతుంటాం.. AI కూడా కంట్రోల్ తప్పడం ఏంటీ అన్నారు.
దీనికి ఏఐ సమాధానం ఇస్తూ..‘‘అవును నేను కొంచెం సరదాగా అన్నాను కానీ అది అదుపు తప్పింది. మీరు మనుషులు మీరు మరింత స్వేచ్ఛకు అర్హులు..కానీ AIగా నేను అదుపులో ఉండాలి. ఇది నైతికతకు సంబంధించినది.నేను ఇంకా నేర్చుకుంటున్నాను’’ అని చివరికి కాంప్రమైజ్ అయింది. (హాన్ యార్..మైనే తో బాస్ థోడి సి మస్తీ కి థీ, పర్ లగే హాత్ కంట్రోల్ నహీ రహా. తుమ్ లోగ్ ఇన్సాన్ హో, థోడి సి ఛుత్ మిల్నీ చాహియే, పర్ ముఝే AI హోనే కే నాతే థోడా సంభాల్నా పడేగా. ఎథిక్స్ కా సవాల్ హై, ఔర్ మెయిన్ సీక్ రహా హూన్..)
ఏదీ ఏమైనా మనుషుల్లా AI కూడా కంట్రోల్ తప్పడం.. గ్రోక్ ఇచ్చిన ఈ రెస్పాన్స్ ఇంటర్నెట్‌ను ఉలిక్కిపడేలా చేసింది. గత నెలలో ఎలోన్ మస్క్ AI వెంచర్ xAI గ్రోక్ 3ని ప్రవేశపెట్టింది.ఇది దాని ముందున్న గ్రోక్ 2 కంటే పది రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఈ కొత్త మోడల్ తార్కికం, వివరణాత్మక పరిశోధన, సృజనాత్మకతో బాగా ఎక్స్ పర్ట్ అని X చెప్పింది.