ఎలాన్ మస్క్.. ఇప్పుడు అధికారికంగా ప్రపంచ కుబేరుడయ్యాడు. తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ.. తన ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత.. ఎలాన్ మస్క్ సంపద ఊహించనంత పెరిగింది. ఏకంగా నికర విలువలో 3.8 శాతం పెరిగింది. దీంతో అధికారికంగా ప్రపంచ కుబేరుడయ్యాడు. సంపదలో తనకు ఎవరూ పోటీ లేరని నిరూపించాడు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అదే చెబుతోంది.
ట్రంప్ గెలుపు తర్వాత టెస్లా స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. ఎలాన్ మస్క్ AI కంపెనీ xAI షేర్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనేక వ్యాపార వెంచర్లున్న ఈ బిలియనీర్ సంపద రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అమెరికార అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక తర్వాత ఏకంగా 5.5లక్షల కోట్లు (7 బిలియన్ డాలర్ల )సంపద ఎలాన్ మస్క్ అకౌంట్లో చేరింది. దీంతో ఈ వరల్డ్ బిలియనీర్ సంపద 340 బిలియన్ డాలర్లను దాటింది.
Also Read : మణిపూర్‌కు 10వేల కేంద్ర బలగాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత ఇన్వెస్టర్లు టెస్లా స్టాక్స్ వైపు ఆసక్తి చూపారు. దీంతో టెస్లా స్టాక్ ధర ఒక్కసారిగా 40శాతం పెరిగింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి మస్క్ నికర విలువ రికార్డు స్థాయిలో 321.7బిలియన్లకు చేరింది. టెస్లా సంపద 3.8శాతం పెరిగి 70బిలియన్ డాలర్ల లాభం మూడున్నర ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అతని నికర విలువ 347.8 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.
ట్రంప్ రాకతో.. ఆయన పాలనలో ఎలాన్ మస్క్ టెస్లాకు అనుకూలంగా ఉంటుందని టాక్ రావడంతో టెస్లాలో అతిపెద్ద వాటాదారు అయిన Space X CEO నికర విలువ ఎన్నికల తర్వాత ఏకంగా 83బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతేకాదు ఎలాన్ మస్క్ సమర్ధుడని, అతను ఎకనామికల్ గా సాధించిన విజయాలను పొగుడుతూ ట్రంప్.. ఎలాన్ మస్క్ ని డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (doge) కి మెమో కోయిన్ అన్నారు.