X(ట్విట్టర్) అధినేత, టెస్లా కంపెనీ ఓనర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ సంపద భారీగా తగ్గింది. గురువారం ప్రకటించిన టెస్లా త్రైమాసిక ఆదాయం తగ్గుదలతో మస్క్ సంపద 16.1 బిలియన్ డాలర్లు క్షీణించింది. 209.6 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ కు టెస్లా కంపెనీలో 13 శాతం వాటా ఉంది. మస్క్ సంపదలో ఎక్కువ భాగం ఈ ఆటో కంపెనీనుంచే పొందాడు. టెస్లా త్రైమాసిక ఆదాయం, అమ్మకాలు రెండూ తగ్గడంతో షేర్లు .3 శాతానికి పడిపోయాయి.
ఎలక్ట్రిక్ వెహికిల్ జగ్గర్ నాట్ ఈ ఏడాది అమ్మకాలలో మొదటి త్రైమాసిక పతనాన్ని చవిచూసింది. మొత్తం లక్షల 35వేల 059 వాహనాలు పంపిణీ చేసిన కంపెనీ.. కార్ల ధరలను పదే పదే తగ్గించిన కారణంగా నాలుగేళ్ల కనిష్ట స్థాయికి మార్జిన్ లు పడిపోయాయి.
అయినప్పటికీ 2023లో మొత్తంగా ఎలాన్ మస్క్ సంపద 70 బిలియన్ డాలర్లకు పైనే పెరిగింది. టెస్లా షేర్లు క్షీణిస్తున్నప్పటికీ LVMH బెర్నార్డ్ ఆర్నాల్డ్ తో దానిని అధిగమించి విస్తృతమైన మార్జిన్ తో మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.
- ALSO READ | డొనాల్డ్ ట్రంప్‌కు 10 వేల డాలర్లు ఫైన్
ప్రతికూల పరిస్థితుల్లో కూడా టెస్లా ఏడాదికి 1.8 మిలియన్ల కస్టర్లకు కొత్త వాహనాలను అందించి ప్రపంచంలోనే అత్యంత విలువైన వాహన ఉత్పత్తి దారుగా నిలిచింది. ఆలస్యమైనప్పటికీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సైబర్ ట్రక్ లను నవంబర్ లో డెలివరీచేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.