Elon Musk:ఎలాన్ మస్క్ ఒక్కరోజు సంపాదన రూ. 2.80 లక్షల కోట్లు..మరోసారి ప్రపంచ కుబేరుడయ్యాడు

Elon Musk:ఎలాన్ మస్క్ ఒక్కరోజు సంపాదన రూ. 2.80 లక్షల కోట్లు..మరోసారి ప్రపంచ కుబేరుడయ్యాడు

ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ కుబేరుడయ్యారు. గురువారం ఒక్కరోజే టెస్లా షేర్లు భారీ స్థాయిలో పెరగడంతో రూ 2.80 లక్షల కోట్లు గడించారు. శుక్రవారం ( అక్టోబర్ 25) వెల్లడించిన టెస్లా మూడో త్రైమాసిక ఫలితాల్లో  అక్టోబర్ 24న తన సంపద 33.5 బిలియన్ డాలర్ల సంపదను పొందినట్లు తెలిపారు. 

బ్లూమ్ బెర్గ్ రిపోర్టు ప్రకారం..టెస్లా విడుదల చేసిన మూడో త్రైమాసిక ఆదాయం ఇది దశాబ్దంలో అతిపెద్ద షేర్ లాభం అని తెలిపింది. 2023 ఏప్రిల్ నుంచి ఇదే అత్యధిక లాభం. టెస్లా స్టాక్ లో ఈ పెరుగుదలతో  మస్క్ నికర ఆదాయం విలువ 270 బిలియన్ డాలర్లకు చేరింది. 

బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఉన్నారు. ఎలాన్ మస్క్.. బెజోస్ కంటే 61బిలియన్ డాలర్ల సంపదతో ముందున్నారు. 

ALSO READ | ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్

మస్క్ సంపదలో 75 శాతం టెస్లా, స్పేస్ X, సోషల్ మీడియా ప్లాట్ ఫాంX , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ  XAI కలిగి ఉన్నాయి. మూడో త్రైమాసికంలో తెలిపిన దాని ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారు టెస్లా స్టాక్ 22 శాతం పెరిగింది.