X (గతంలో ట్విట్టర్) లో కమ్యూనిటీ నోట్ ఫీచర్..ఉపయోగం ఏంటీ..సైన్ అప్ చేయడం ఎలా?

X (గతంలో ట్విట్టర్) లో కమ్యూనిటీ నోట్ ఫీచర్..ఉపయోగం ఏంటీ..సైన్ అప్ చేయడం ఎలా?

X (గతంలో ట్విట్టర్) లో కమ్యూనిటీ నోట్ ఫీచర్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. X ద్వారా పరిచయం చేయబడిన ఈ ఫీచర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 69 దేశాల్లో కంట్రిబ్యూటర్లను కలిగి ఉంది. ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని Xలో షేర్ చేశారు. భారత్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున ఈ ఫీచర్ ను అందు బాటులో తెస్తున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు. ఇంతకీ ఏంటీ కమ్యూనిటీ నోట్ ఫీచర్.. దీనివల్ల ఉపయోగం ఏంటీ.. ఎన్నికల సమయంలో భారత్ లో అందుబాటులోకి ఎందుకు తెచ్చారు వంటి విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.. 

కమ్యూనిటీ నోట్ ఫీచర్.. ఇది Xలో షేర్ చేసే పోస్టులు వాస్తవమైనవా..లేక ఫేక్ న్యూసో తేల్చేందుకు ఫ్యాక్ట్ చెక్ లా ఉపయోగించేది ఫీచర్. మరికొద్ది రోజుల్లో భారత్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందంటున్నారు X బాస్ ఎలాన్ మస్క్. ఎన్నికలో సమయంలో X లో షేర్ చేసే న్యూస్ ఫ్యాక్ చేయడానికి కంట్రిబ్యూటర్లను ఆహ్వానించారు ఎలాన్ మస్క్. వారి అభిప్రాయాలతో ఫ్యాక్ట్ చెక్  నిర్దారణణ జరుగుతుందంటున్నారు.  

అయితే Xలో కమ్యూనిటీ నోట్ ఫీచర్ లోకి ఎలా సైన్ అప్ చేయాలి.. ఫీచర్ సైన్ అప్ కోసం కమ్యూనిటీ నోట్స్ ఆఫీషియల్ హ్యాండిల్ అందించిన లింక్ పై క్లిక్ చేయాలి. తర్వాత కొన్ని షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. అంగీకరిస్తేనే ఫీచర్ కు సహకరించే సభ్యులు అవుతారు. 2022 డిసెంబర్ లో ప్రపంచ వ్యాప్తంగా Xలో పోస్టులకు సంబంధించిన కమ్యూనిటీ నోట్స్ ను వీక్షించడానికి కస్టమర్లకు అనుమతించే  ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ 69 దేశాల నుంచి కంట్రిబ్యూటర్లను కలిగి ఉంది. 

భారత్ లో X  ఫ్లాట్ఫాం అనే సవాళ్లను ఎదుర్కొంటోంది. Xలో షేర్ చేస్తున్న పోస్ట్లు ఫేక్ అని  ప్రజలకు, అటు ప్రభుత్వాల భద్రతకు ఆటంకం కలిగించే కంటెంట్ షేర్ అవుతున్నందున వాటిని తొలగించాలని చట్టపరమైన చర్యలకు గురవుతోంది. దీంతో భారత్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు అందించే సమాచారం పక్కాగా ఉండేందుకు ఈ ఫ్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో తెలిపారు.