వివాదాస్పద యూట్యూబర్, బిగ్ బాస్ OTT 2 విన్నర్ ఎల్విష్ యాదవ్.. పాము విషం కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఎల్విష్ యాదవ్ నోయిడా జైలులో ఉన్నారు. నోయిడా, గురుగ్రామ్ లలో రేవ్ పార్టీలకు పాము విషాన్ని సప్లయ్ చేశాడనే ఆరోపణలతో అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఎల్విష్ కార్లు, ఆస్తుల విషయంపై అతని తల్లిదండ్రులు స్పందించారు.
అయితే ఎల్విష్ చాలా జల్సా చేసేవాడని..అతనికి విలాసవంతమైన కార్లు, విదేశాల్లో ప్రాపర్టీ ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అతని తల్లిదండ్రులు అంటున్నారు. యూట్యూబర్ ఎల్విష్ కు పోర్సే, మెర్సిడెస్ వంటి ఖరీదైన కార్లు లేవని , అతను తన వీడియో చూపించేవి అతని స్నేహితుల కార్లు అని చెపుతున్నారు. ఎల్విష్ యాదవ్ కు టోయోటా ఫార్చ్యూనర్, వ్యాగన్ ఆర్ మాత్రమే ఉన్నాయని, ఈ రెండూ లోన్ పై కొనుగోలు చేశాడని తెలిపారు. అతని స్నేహితులను విలాస వంతమైన కార్లను అప్పుడప్పుడు తీసుకుంటాడని చెప్పారు.
ALSO READ :- IPL 2024: ఐపీఎల్ టికెట్స్.. ఆన్‌లైన్‌లో ఎలా,ఎక్కడ బుక్ చేసుకోవాలి
యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్.. బిగ్ బాస్ విజయం తర్వాత దుబాయ్ లో రూ. 8 కోట్ల ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. యూట్యూబ్ ఛానల్ లో తన అభిమానులకు హౌస్ టూర్ కూడా ఇచ్చాడు. అయితే అతనికి ఇల్లు కూడా లేదని అతని పేరు మీద భూమి, ఇతర ఆస్తులు కూడా లేవని అతని తల్లిదండ్రులు చెప్పడంతో ఈకేసు కీలక మలుపు చోటు చేసుకుంది.