
- 11 నుంచి స్టార్ట్.. 18న సీట్ల కేటాయింపు మొదలు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 4 నుంచి ప్రారంభం కావాల్సిన టీఎస్ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన స్టూడెంట్లకు ఈ నెల 11 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ రివైజ్డ్ షెడ్యూల్ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం రిలీజ్ చేశారు. ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు గతంలో ప్రకటించినట్టు ఈ నెల15న కాకుండా, 18న చేయనున్నట్టు వెల్లడించారు. రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పాత షెడ్యూల్ ప్రకారమే ఈ నెల11లోగా పూర్తి చేస్తామన్నారు. 16న ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుందన్నారు. సీట్లు అలాటైన వారు 18 నుంచి 23 వరకు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు.