పాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావం

పాత్రికేయుల రాజకీయ పార్టీ ఆవిర్భావం
  • ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెబ్ సైట్ ఆవిష్కరణ

ఖైరతాబాద్​,వెలుగు: అవినీతి, నేర చరిత్ర లేని సమాజం కోసం నిరంతరం కష్టపడే జర్నలిస్టులు రాజకీయాల్లోకి రావలసిన అవశ్యకత ఉందని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. భారత వర్కింగ్​జర్నలిస్టుల అసోసియేషన్, తెలుగు రాష్ట్ర సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘ సంయుక్తాధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ‘పాత్రికేయుల రాజకీయ పార్టీ’ఆవిర్భావం జరిగింది.

ఈ సందర్భగా జరిగిన రౌండ్​ టేబుల్​ సమావేశంలో బడ్జెట్​పాలిటిక్స్, నవ సమాజ స్థాపన, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, నిరుద్యోగ యువత భవిష్యత్, అవినీతి– నేర రహిత, నిస్వార్థ సమాజం వంటి అంశాలపై ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. బీసీ కమిషన్​మాజీ చైర్మన్​ బీఎస్ రాములు, ఏడబ్య్లూజేఏ జాతీయ అధ్యక్షుడు కె.కోటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలను పంపడానికి వెబ్ సైట్ ను ఆవిష్కరించారు.