
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మంగళవారం (ఫిబ్రవరి 18) బ్లూ డార్ట్ కార్గో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తోన్న క్రమంలో కార్గో ఫ్లైట్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరాడు. ఇతర విమానాలను ఆపి వెంటనే కార్గో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్‌కు శంషాబాద్ ఏటీసీ అధికారులు పర్మిషన్ ఇచ్చారు.
Also Read :- ఔటర్ రింగ్ రోడ్పై వెళుతున్నారా..? జాగ్రత్త..!
దీంతో కార్గో విమానం ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. నిత్యం ప్రయాణీకుల రద్దీతో హడావుడిగా ఉండే శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు, ఎయిర్ లైన్స్ సంస్థ ఊపిరి పీల్చుకుంది. విమానం ల్యాండ్ అయిన అనంతరం రంగంలోకి దిగిన అధికారులు ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు