ముంబయి - విశాఖ విమానానికి తప్పిన ప్రమాదం.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ముంబయి - విశాఖ విమానానికి తప్పిన ప్రమాదం.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సాంకేతిక లోపంతో ముంబై-విశాఖ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. విమానంలోని 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ : బిల్డింగ్​పై కూలిన ఫ్లైట్.. కాలిఫోర్నియాలో ఇద్దరు మృతి

ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసర ల్యాండింగ్ చేశారు అధికారులు. వాతావరణం అనుకూలించి, విమానానికి అనుమతులు వచ్చిన తర్వాత ప్రయాణికులతో  విమానం మళ్లీ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.