టెక్నాలజీ పెరిగే కొలదీ ఉద్యోగాలు తగ్గిపోతాయనే సందేహాలు చాలా రోజులుగా వినిపిస్తున్నవే. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రవేశంతో ఆ భయం మరింత పెరిగింది. అయితే ప్రస్తుత సాంకేతిక ప్రపంచానికి అవసరాన్ని బట్టి కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తూనే ఉంది. దానికి అనుగుణంగా కొత్త ఉద్యోగాలు కూడా వస్తూనే ఉన్నాయి. దానికి కావాల్సిందల్లా కొత్త టెక్నాలజీకి అనుకూలంగా అప్డేట్ అవ్వడమే.
ఇండియన్ ఐటీ సెక్టార్ 2030 వరకు 2 మిలియన్ల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందట. అంటే ఐటీ ఇండస్ట్రీలో 2030 వరకు 20 లక్షల జాబ్ క్రియేషన్ జరుగుతుందని ఒక రిపోర్ట్ ద్వారా తెలసింది. అయితే ఈ 20 లక్షల ఉద్యోగాలలో బ్లాక్ చైన్ (Blockchain), జెనరేటివ్ ఏఐ (Generative AI) లే ముందు వరుసలో ఉంటాయని చెబుతున్నారు టెక్ ఎక్స్పర్ట్లు.
ఇండియాలో టెక్నాలజీ స్టాఫ్ ను అందించే క్వెస్ ఐటీ స్టాఫింగ్ ( Quess IT Staffing) నివేదిక ప్రకారం.. 2030 వరకు క్వాంటమ్ కంప్యూటింగ్ ( Quantum Computing), జనరేటివ్ ఏఐ (Generative AI) రంగాలు 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాయని నివేదిక వెల్లడించింది.
బెంగళూరు, హైద్రాబాద్ డామినేషన్:
రానున్న టెక్నాలజీకి సంబంధించి ఉద్యోగులను అందించడంలో దేశంలో బెంగళూరు, హైద్రాబాద్, పునే ముందు వరుసలో ఉంటాయని రిపోర్టు ద్వారా తెలిపింది. బెంగళూరు 43.3 శాతం జాబ్స్ తో టాప్ కంట్రిబ్యూటర్ గా ఉండనుందని, హైద్రాబాద్ 13.4 శాతంతో రెండవ స్థానం, ఇక పునే 10 శాతంతో 3వ స్థానంలో ఉంటుందని నివేదిక వెల్లడించింది.
ALSO READ | Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాలు భారత ఎకానమీకి 150 బిలియన్ డాలర్ల కంట్రిబ్యూట్ చేస్తాయని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈఓ కపిల్ జోషి తెలిపారు. అయితే రానున్న రోజుల్లో ఈ సెక్టార్లలో కనీస ప్రారంభ వేతనం అంటే 0 నుంచి 3 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లకు రూ.6 లక్షల నుంచి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక 3 నుంచి 8 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న ఉద్యోగులకు 12 నుంచి 35 లక్షల సాలరీ ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా సీనియర్ లెవల్ ఎంప్లాయిస్ కి 30 నుంచి 40 లక్షల సాలరీ ఉంటుందని నివేదిక ద్వారా తెలిపింది.