దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షేక్ మహ్రా బిన్త్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. తన భర్త షేక్ మనా బిన్ మహ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ నుండి విడాకులు ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది.
"ప్రియమైన భర్త గారు.. మీరు ఇతర పనులలో బాగా నిమగ్నమై ఉన్నారు. నేను నా విడాకులను ప్రకటిస్తున్నాను. నీకు విడాకులు ఇస్తున్నాను.. నీకు విడాకులు ఇస్తున్నాను.. నేను నీకు విడాకులు ఇస్తున్నాను.. జాగ్రత్త. మీ మాజీ భార్య.." అని ఇన్‌స్ట్రాగ్రాంలో దుబాయ్ యువరాణి షేఖా మహరా పోస్టు చేశారు. సోషల్ మీడియా ద్వారా మూడు సార్లు విడాకులు ప్రకటించి.. భర్తతో తెగతెంపులు చేసుకున్నారు.
Also Read :- ఒమన్లో నౌక ప్రమాదం
కాగా షేక్ మహ్రా బిన్త్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ ల వివాహం మే, 2023లో జరిగింది. అనంతరం ఈ ఏడాది మేలో ఈ జంటకు కుమార్తె జన్మించింది.