హనుమాన్ డబ్బు కొట్టేసిన ఉద్యోగి.. రూ.37 లక్షలు చోరీ

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ఉద్యోగి చేతివాటం చూపించాడు. ఆలయానికి చెందిన 37 లక్షల 80 వేల రూపాయలను ఉద్యోగి శ్రీనివాసాచారి సొంతానికి వాడుకున్నాడు. ఇది  ఆలయ అధికారుల దృష్టికి రావడంతో చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. నిధుల రికవరీతో పాటు శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారుకు నివేదించామని తెలిపారు ఆలయ ఈవో.

ఆలయ పరిధిలో దుకాణాలు నిర్వహించే వ్యాపారుల దగ్గర వసూలు చేసిన 37 లక్షల 90 వేల రశీదులు ఆలయ అధికారులకు అందిచినప్పటికీ వాటిని ఆలయ ఖాతాలో జమచేయలేదన్నారు. 15 ఏండ్లుగా  ఆలయం టెండర్ల  సీనియర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నారు శ్రీనివాసాచారి.