తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఇవ్వాల్సిన మొదటి పీఆర్సీ అమలు “అందని ద్రాక్ష..” కథ లెక్క మారింది. 2018 మార్చి ఉద్యోగుల సభ, 53 టీచర్ సంఘాల జాయింట్ యాక్షన్ తో ఎంప్లాయిస్, టీచర్లలో అసంతృప్తిని గ్రహించిన సీఎం కేసీఆర్.. 2018 మే16న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై పీఆర్సీ తో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రకటించారు. ఆ రోజు మీతో జరిగిన చర్చలో పాల్గొన్న టీచర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు రిటైర్ అయినప్పటికీ ముగ్గురు నలుగురు ఇంకా బాధ్యతల్లో ఉన్నరు. మీరు ఆనాడు చెప్పిన మాటలు ఇంకా మా చెవుల్లో గింగిర్లు తిరుగుతూనే ఉన్నయి. గత పీఆర్సీల్లో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు వల్ల బాగా లేట్ అయినందున ముగ్గురు సభ్యుల కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ వర్తింపు తేదీ 2018 జులై 1కి కాకుండా రాష్ట్ర ఆవిర్భావ తేదీ 2018 జూన్ 2కు మార్చాలని కోరగా.. ఆఫీసర్లు కొన్ని అభ్యంతరాలు లెవనెత్తినా మీరు వాటిని తోసిపుచ్చి జూన్ 2 నుంచే వర్తింపజేసేందుకు ఒప్పుకున్నారు. మూడు రోజుల్లో త్రీ మెంబర్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎస్ను ఆదేశించారు. జూన్ 2 లోపు కమిషన్ రిపోర్టు ఆధారంగా ఐఆర్ ప్రకటిస్తానని, 2018 ఆగస్టు 15న పీఆర్సీ ఫిట్మెంట్ నిర్ణయించుకొని అమలు చేస్తామని చెప్పారు. ఆ మీటింగ్ తరువాత ప్రెస్ మీట్ లో మీరే ఈ విషయాలన్ని చెప్పగా రాష్ట్రంలోని లక్షల మంది టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో సంతోషించారు.
రెండున్నర ఏండ్లుగా సాగదీస్తున్నరు
అప్పుడు ఉద్యోగులపై అంత ప్రేమ చూపిన కేసీఆర్ లో ఇంత మార్పుకు కారణం ఏంటి? పీఆర్సీ రిపోర్టు గడువును పెంచుతూ పెంచుతూ 2020 డిసెంబర్ వరకు తీసుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, హుజూరనగర్ ఎలక్షన్ టైమ్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పి రెండున్నరేండ్లుగా సాగదీస్తూనే ఉన్నారు. 2018 ఆగస్టులో పీఆర్సీ అమలు చేస్తానన్న మీరు ముందస్తు ఎన్నికల ఆలోచనతో దాన్ని ప్రక్కకు పెట్టి, 2018 డిసెంబర్-లో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. పీఆర్సీ అమలుపై మాట తప్పినందుకు టీచర్లు, ఉద్యోగులు ఆ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేయడంతో కక్ష పెంచుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లు మీకు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో ఉద్యోగుల పై కోపం మరింత పెంచుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీచర్లను డ్యూటీకి దూరంగా ఉంచారు.
టీచర్లు, ఎంప్లాయిస్ కు చేసిందేం లేదు
నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ కు… ఎంప్లాయిస్ ను వేధించిన ప్రభుత్వాలకు వాళ్లు వ్యతిరేకంగా పనిచేసి ఎన్నికల్లో ఓటమికి ఎట్ల సహకరిస్తరో తెలిసినదే. ప్రస్తుతం వారి రెండు టర్మ్ ల పాలనలో ఉద్యోగులకు చేసిన చెప్పుకోదగ్గ మేలు ఏం లేదు. ఏపీ సర్కారు నియమించిన పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఆధారంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి బాగా ఇచ్చానని గొప్పలు చెప్పుకోవడం సరికాదు. ఇదివరకు 9వ పీఆర్సీలో ఇచ్చిన 39 శాతం ఫిట్మెంట్ కంటే ఎక్కువ ఇచ్చింది 4 శాతం మాత్రమే. 2 జూన్, 2014 నుంచి పీఆర్సీ బకాయిలు చెల్లిస్తానని చెప్పి.. ఉద్యోగులు ఎన్నో సార్లు ఒత్తిడి చేస్తే తప్ప తొమ్మిది నెలల బకాయిలను 18 విడతల్లో చెల్లించలేదు. పీఆర్సీ అమలుతోపాటు ఉద్యోగుల ఇతర సమస్యల విషయంలో కూడా సవితి ప్రేమ చూపుతున్నారు. హెల్త్ కార్డుల అమలు సరిగాలేదు, టీచర్లకు ఐదేండ్లుగా ప్రమోషన్లు లేవు. ఏటా జరగాల్సిన ట్రాన్స్ ఫర్లు మీ ఏడేండ్ల పాలనలో 2015, 2018లో రెండే సార్లు చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్పౌస్ ట్రాన్స్ ఫర్లు జరగనే లేదు. 33 జిల్లాలు ఏర్పాటు చేసినా కొత్త పోస్టుల మంజూరు లేక లక్షన్నర పొస్టులు ఖాళీగా ఉంచి, ఉద్యోగుల పై పని భారాన్ని పెంచారు. టీచర్ల, ఉద్యోగ సంఘాలు, నేతలను నయాన, భయాన.. ప్రశ్నించలేని స్థితికి చేర్చారు. చివరకు ఉద్యోగుల సమస్యల సాధన బాధ్యతను రాజకీయ పార్టీలు తమపై వేసుకొని ధర్నాలు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు.
చివరగా మేం కోరేది
పీఆర్సీ అమలు గడువు మరోసారి పెంచకుండా రాబోయే 2021 కొత్త సంవత్సరం కానుకగా ప్రకటించాలని ఆశిస్తున్నాం. 2018 మే 16 నాటి చర్చల్లో ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్సీ అమలు తేదీని రాష్ట్ర ఆవిర్భావ దినమైన 2018 జూన్ 2 నుంచి వర్తింప చేయాలి. ఫిట్ మెంట్ కూడా గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కుగా ఇవ్వాలని కోరుతున్నాం. జీతాల పెంపుతో ఇంత ఆర్థిక భారం అని లెక్కించడమే కాకుండా ఉద్యోగుల స్థితిగతులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నామన్న తమరి మాటలు నిజమే. రాష్ట్రంలో జీవన వ్యయము కూడా ఎక్కువే. 30–35 ఏండ్లు ఉద్యోగం చేసి కనీసం సొంతింటి కలను నిజం చేసుకోలేని పరిస్థితి. మాములు టౌన్ లో 200 గజాల ఇంటి జాగా లేదా ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 50 లక్షలకు తక్కువ లేదు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు నోషనల్ అనే పదం లేకుండా పీఆర్సీ అమలు తేదీ నుంచి బకాయిలు చెల్లిస్తూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని.. ఇచ్చిన మాట తప్పని సీఎంగా చరిత్రలో నిలవండి.
పీఆర్సీపై హామీలు ఏమైనయ్?
- వెలుగు ఓపెన్ పేజ్
- December 28, 2020
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?