
గూగుల్, మైక్రోసాఫ్ట్... ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఆ సంస్థ ఉద్యోగులే. మరి అన్ని కంపెనీల్లో ఉద్యోగులు ఉంటారు. కానీ, కొన్ని మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతాయి? ఒక్కసారి ఆ కంపెనీలకు వెళ్లి చూస్తే నిజం తెలుస్తుంది. వాళ్లు మాములు ..నైన్ టు ఫైవ్... ఉద్యోగుల్లా ఉండరు. ఎక్కువ ప్రొడక్టివ్ గా ఉంటారు. పట్టు వదలని విక్రమార్కుల్లా పనిచేస్తారు.పని వేళలు కూడా పట్టించుకోరు. అలాంటి సంస్థలు ఎప్పుడూ .. ఎలా విజయాలు సాధిస్తాయో తెలుసుకుందాం. . .
అంటే సింపుల్.. వాళ్లకు వాళ్ల ఆర్గనైజేషన్ పట్ల నమ్మకం. వాళ్లు సాధించాలనుకున్న దానికి దగ్గరగా ఉండటం. పని పట్ల ప్రేమ... ఇవన్ని ఎట్ల వస్తాయి? అంటే.. గూగుల్, మైక్రోసాఫ్ట్ సేమ్ రీజన్ చెప్పాయి.. అందులో ఉండే లీడర్లు డైలీ తమ ఉద్యోగులను మోటీవేట్ చేస్తూ స్ఫూర్తి నింపుతుంటరని.... ఒక లీడర్ ఉద్యోగులని ఎట్ల మోటివేట్ చెయ్యాలి.... ఎట్ల స్ఫూర్తి నింపాలన్న దానికి వాళ్ల దగ్గర ఆరు సూత్రాలు ఉన్నాయి. చిన్నపాటి టీకొట్టు నుంచి పెద్ద యాపిల్ కొట్టు వరకు ఉద్యోగులే ఊపిరిగా నడిచే సంస్థలన్నిటికీ ఈ సక్సెస్ ఫార్ములాలు అవసరమే.
ఒక లక్ష్యం నిర్ణయించండి...
ఉద్యోగులకు రోజువారీగా ఒక లక్ష్యం నిర్ణయించండి. వాళ్లకు ఒక గోల్ సెట్ చేసినప్పుడు సగటు ఉద్యోగి కంటే 3.6 రెట్లు ఎక్కువ పని చేస్తరట. గోల్ కు తగ్గట్టు పని చేసేలా వాళ్లని నిత్యం మోటివేట్ చెయ్యాలి.
ఎలా మోటివేట్ చేయాలంటే..
- ముందుగా మీరు ఆ ఉద్యోగి నుంచి ఏం ఆశిస్తున్నారో వివరించాలి.
- మీ రోల్ ఇలా ఉండబోతుంది' అని వాళ్ల సక్సెస్ ను విజువలైజ్ చేయాలి.
- ఆ ఉద్యోగి కంట్రిబ్యూషన్ సంస్థ విజయానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలి..
- సంస్థ లక్ష్యాన్ని ఉద్యోగి లక్ష్యంగా మార్చడం చాలా ముఖ్యం.
- టీమ్ లో ప్రతి ఒక్కరూ ముఖ్యమే. అందరినీ గుర్తించాలి.
చిన్న విజయాన్ని కూడా సెలబ్రేట్ చెయ్యాలి
సంస్థ చిన్న విజయం సాధించినా.. పెద్దగా సెలబ్రేట్ చెయ్యాలి.చిన్నచిన్నమైలురాళ్లను సెలబ్రేట్ చెయ్యడం వల్ల పెద్ద విజయానికి పునాదులు పడతాయి. అది తెలియకుండానే ఉద్యోగుల మోటివేషన్‌కు కారణమవుతుంది. ఇలా సెలబ్రేట్ చేసినప్పుడు ఉద్యోగులు తమ ముందున్న సవాళ్లను కూడా మీకు వివరిస్తారు.
విశ్లేషణాత్మక ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. ..
మీ ఉద్యోగి మంచిగా పని చేసినప్పుడు 'వెల్డన్... గ్రేట్ ' అని పొగిడితే సరిపోదు. అంతకు మించి ఉద్యోగి ఇంప్రూప్ కావడానికి విశ్లేషణాత్మక ఫీడ్ బ్యాక్ అవసరం. టైమ్ టు టైమ్ మీరు ఇచ్చే ఫీడ్ బ్యాకే సంస్థ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఉద్యోగికి విశ్లేషణాత్మక ఫీడ్ బ్యాక్ అందించాలి. ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలో వివరించాలి. బాగా పెర్ ఫార్మ్ చెయ్యని ఉద్యోగి విషయంలో 'గోల్డెన్ రేషియో 5:1ఫార్ములా అనుసరించాలి. అంటే ఆ ఉద్యోగికి 5 రకాలుగా పాజిటివ్ మోటివేషన్ ఇచ్చి ఒక్క ప్రతికూల మోటివేషన్ ఇవ్వాలి.
ALSO READ | Sivaratri 2025: తెలంగాణలో త్రికూట( త్రిమూర్తుల) ఆలయం.. వాల్గొండలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు..
ప్రతికూల మోటివేషన్ అంటే సీరియెస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందనే సూచన ఇవ్వాలి. ఎక్కువ పాజిటివ్ మార్గాలని అనుసరించడం వల్ల ఆ విమర్శని ప్రతికూలంగా తీసుకోకుండా తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉద్యోగి ప్రయత్నిస్తాడు.
నేర్చుకునే అవకాశం కల్పించాలి..
ఒక సమస్యను స్వయంగా ఉద్యోగే పరిష్కరించేందుకు అవకాశం ఇవ్వాలి. ఇందుకు లీడర్ గా మీ గైడెన్స్, సపోర్ట్ ఇస్తూ నేర్చుకునేందుకు అవకాశం కల్పించాలి. ఉద్యోగుల ఐడియాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీని వల్ల వాళ్ల నైపుణ్యాలు, సమస్యల పట్ల వాళ్లకున్న దృక్పథం మీకు తెలుస్తుంది.
- మీ టీమ్ చెప్పే ఐడియాలను వినండి.
- వారిలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని గుర్తించండి.
- వాళ్లు స్వయంగా నేర్చుకునేందుకు అవకాశం కల్పించండి.
- వాళ్ల పనికి వాళ్లే బాధ్యత
- ఫెయిల్యూర్ ని నేర్చుకునేందుకు వచ్చిన అవకాశమనే భావన వారిలో కల్పించండి.
ప్రామిస్ చెయ్యండి.
ప్రయోగాలు చెయ్యాలి..
ఉద్యోగులని ఈ విధంగా మోటివేట్ చెయ్యాలి' అని చెప్పడానికి ఒక కచ్చితమైన ఫార్ములా ఏదీ లేదు. కాబట్టి దీనికి టీమ్‌తో నిత్యం కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యాలి. ఆ సమయంలో మీ ఉద్యోగులు సంతోషంగా, ఉత్సాహంగా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. డెలోయిటీ టాలెంట్ 2020 నివేదిక ప్రకారం తమ నైపుణ్యాల్ని సంస్థలు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని 42 శాతం మంది ఉద్యోగులు చెప్పారు.
మోటివేషన్ చేయడం వల్ల వయసు, జెండర్, మతాలతో సంబంధం లేకుండా 55 శాతం మంది ఉద్యోగులు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తున్నట్లు చాలా సర్వేల్లో గుర్తించారు. అంతేకాదు, మోటివేషన్ చేస్తున్న సంస్థల్లో ఉద్యోగులు పని వేళలని పట్టించుకోకుండా ఎక్కువ సమయం పని చేస్తున్నారని కూడా తేలింది.
–వెలుగు, లైఫ్–