ChatGPT వంటి OpenAI చాట్బాట్లను ఉపయోగిస్తే.. డేటా లీక్ అయ్యే ప్రమాదం కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగులు వినియోగదారులతో చాటింగ్, వివిధ ప్రాంప్ట్ లలో సమాధానం ఇచ్చేందుకు ఉత్పాదక AI చాట్‌బాట్ ప్రోగ్రామ్ ను ఉపయోగిస్తున్నాయి. చాట్ జీపీటీ(ChatGPT) వినియోగంతో కంపెనీలకు చెందిన సున్నితమై డేటా లీక్ ( Data Leaks) అయ్యే అవకాశం ఉందని కంపెనీల యాజమాన్యం ఆందోళన చెందుతోంది. దీనిని అరికట్టేందుకు ChatGPT ని ఉపయోగకరంగా ఎలా వినియోగించుకోవాలనే అంశంపై గూగుల్, మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
2022 నవంబర్‌లో ChatGPT ప్రారంభం తర్వాత చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్. ఇది ఉత్సాహం తోపాటు హెచ్చరికలను కూడా చేసింది.OpenAI కి దాని రెగ్యులేటర్లకు మధ్య పంచాయతీని పెట్టింది. ప్రత్యేకించి యూరప్ లో కంపెనీ డేటా సేకరణపై వాచ్ డాగ్ లనుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
ఇతర కంపెనీలకు చెందిన ఉద్యోగులు రూపొందిచిన చాట్ లలో దేనినైనా చదవవచ్చు. ట్రైనింగ్ సమయంలో ఇచ్చిన డేటాను OpenAI పునరుత్పత్తి చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. దీంతో కంపెనీల డేటా విషయంలో ప్రమాదమే అని అంటున్నారు.
ChatGPT ని ఉపయోగించే వ్యక్తిగత ఉద్యోగుల సమస్యల గురించి అడిగినప్పుడు సమాధానం చెప్పేందుకు OpenAI నిరాకరించింది. స్పష్టమైన అనుమతి ఇస్తే తప్ప.. చాట్‌బాట్ నుంచి డేటా ఉపయోగించబడదని కార్పొరేట్ భాగస్వాములకు హామీ ఇచ్చే ఇటీవలి కంపెనీ బ్లాగ్ పోస్ట్‌ను హైలైట్ చేసింది.
వ్యక్తులు Google బార్డ్‌ని ఉపయోగించినప్పుడు అది Text, Location, ఇతర వినియోగ సమాచారం డేటాను సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని వారి ఖాతాలనుంచి తొలగించేందుకు, AIకి అందించబడిన కంటెంట్‌ను తొలగించమని అభ్యర్థించేందుకు ఆప్షన్ ఉందని గూగుల్ మాతృక ఆల్పాబెట్ తెలిపింది.