మెడిటేషన్ చేయండి
‘వర్క్ ఫ్రం హోం’ పై మైక్రోసాఫ్ట్ సూచనలు
నూయ్యార్క్: కరోనా కాటు నుంచి తప్పించుకోవడానికి దాదాపు ప్రతి ఐటీ కంపెనీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం తెలిసిందే. ఇంటి నుంచి బాగా పనిచేయడంతోపాటు ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెబుతూ ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ కొన్ని సూచనలు చేసింది. ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ జేర్డ్ స్పటారో కొన్ని విషయాలను రాయగా సీఈఓ సత్య నాదేళ్ల వాటిని షేర్ చేశారు.
డబ్ల్యూఎఫ్ హెచ్ కోసం గైడ్ లైన్స్ ఇవ్వండి
కొత్త ఉద్యోగి చేరాక అతనికి పని నేర్పించడానికి కంపెనీలు కొన్ని ట్రైనింగ్ ప్రోటోకాల్స్ ను సిద్ధంగా ఉంచుతాయి. అయితే కొత్త ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నపుడు వారికి ఇలాంటి ప్రోటోకాల్స్ అందివ్వడంతో పాటు అదనంగా సాయం చేయాలని స్పటారో అన్నారు. ఎంత శిక్షణ ఇచ్చినా ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు.
మీటింగుల నిర్వహణ
ఆఫీసుల్లో పనిచేసే వారికి మీటింగులు తప్పవు. వీటి సమయాన్ని తగ్గించుకోవాలని స్పటారో సూచించారు. బ్యాక్ టు బ్యాక్ విధానంలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తే అందరికీ మేలని ఆయన అన్నారు. ఎదురెదురుగా కాకుండా వీపులు తాకేలా మనుషులు కూర్చొనే విధానాన్ని బ్యాక్ టు బ్యాక్ అంటారు.
డబ్ల్యూఎఫ్ హెచ్ చేసే వాళ్లకు ప్రయాణం అవసరం లేదని, జిమ్ కు వెళ్లేందకు వీలు ఉండదు కాబట్టి వీలైనప్పుడల్లా ధ్యానం చేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. పని మద్యలో అప్పుడప్పుడు గట్టిగా గాలి పీల్చి వదలాలని చెప్పింది. అంతేకాదు ఈ కంపెనీ తన ఉద్యోగుల కోసం వర్చువల్ మెడిటేషన్ క్లాసులను నిర్వహిస్తోంది. ‘‘ఎలాంటి అంతరాయం ఉండని, ప్రశాంతత కలిగిన చోట కూర్చోండి. మీ మైక్రోఫోనున్ మ్యూట్ చేయండి. దీనివల్ల ఇతరులు కూడా నిశ్చబ్దం ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తారు. మీ కెమెరా ద్వారా సెషన్ లీడర్ ఇచ్చే సూచనలను పాటించండి. ఆయన మీకు శ్వాస తీసుకోవాల్సిన విధానాల గురించి వివరిస్తారు. ఆ తరువాత కెమెరాను ఆఫ్ చేసి పూర్తాగా మీ మనసు ప్రశాంతంగా ఉండేలా ధ్యానం చేయండి” అని స్పటారో వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీమ్ మేనేజెమ్ంట్ చాలా ముఖ్యమని, ఈ విషయంలో టీమ్ మేనేజర్లు మరింత జాగ్రత్తగా వ్వవహరించాలని మైక్రోసాఫ్ట్ సూచించింది.
For More News..