ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి..శ్రీధర్ బాబుకు ఉద్యోగుల జేఏసీ వినతి

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి..శ్రీధర్ బాబుకు ఉద్యోగుల జేఏసీ వినతి

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని  మంత్రి శ్రీధర్ బాబును ఉద్యోగుల జేఏసీ నేతలు కోరారు. గురువారం మంత్రిని ఆయన నివాసంలో చైర్మన్  జగదీశ్వర్, సెక్రటరీ జనరల్  శ్రీనివాసరావులతో సహా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల,  కార్మికుల , పెన్షనర్స్  రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమవేశంలో తీసుకున్న తీర్మానాల కాపీని మంత్రికి నేతలు అందజేశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని జేఏసీ నేతలకు మంత్రి హామీ  ఇచ్చినట్టు నేతలు తెలిపారు.