నల్ల బ్యాడ్జీలతో ఆలయ ఉద్యోగుల నిరసన

భద్రాచలం, వెలుగు : ఏపీలోని పురుషోత్తపట్నంలో కబ్జాలను నిరసిస్తూ భద్రాచలం దేవస్థానం ఉద్యోగులు గురువారం నల్లబ్యాడ్జిలతో నిరసనకు దిగారు. ఈఓ ఎల్.రమాదేవి ఆధ్వర్యంలో ఉద్యోగులంతా తానీషా కల్యాణ మండపం వద్దకు చేరి ఆక్రమణదారులు దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

రాములోరి భూములను కాపాడుకునేందుకు వెళ్లిన తమపై దాడి చేశారని, ఏపీలోని ఎటపాక పోలీస్​స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు టీఎన్జీవో డివిజన్​అధ్యక్ష, కార్యదర్శులు డెక్కా నర్సింహారావు, బాలకృష్ణ సంఘీభావం తెలిపారు.