
గండిపేట, వెలుగు: కోకాపేటలోని నియో పోలిస్లేఅవుట్లో శుక్రవారం పలువురు నిరుద్యోగులు నిరసన తెలిపారు. కంచె గచ్చిబౌలి భూములను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్అడ్డుకోవడం కరెక్ట్కాదన్నారు. బీఆర్ఎస్హయాంలో కోకాపేటలోని భూముల్లో నియో పోలిస్లేఅవుట్వేసినప్పుడు ప్రకృతిపై లేని ప్రేమ గచ్చిబౌలి భూములపై ఎందుకని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఐటీ కంపెనీలను పెంచేందుకు కృషి చేస్తుంటే కేటీఆర్ అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కోకాపేటలో కోట్లు తీసుకొని ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు భూములు కట్టబెట్టారని మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వం చేసే పనులను అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.